నితిన్ మాచర్ల నియోజకవర్గం కు చావో రేవో

ఏ హీరోకైనా ఫ్లాపులు కామన్. కానీ ఫ్లాపులే కామన్ అయితే మాత్రం కష్టం. ప్రస్తుతం అలాంటి సిట్యుయేషన్ లోనే ఉన్నాడు నితిన్. వరుసగా సినిమాలు చేస్తున్నా.. అదే వరసలో అవన్నీ పోతున్నాయి. అంచనాలు పెంచుతున్నాడు. అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఎక్స్ పెక్టేషన్స్ పెంచి మాచర్ల నియోజకవర్గం అంటూ వస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ నెల 12 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మరి ఈ మూవీతో అయినా నితిన్ హిట్ కొడతాడా లేక.. పాత ఫ్లాప్ వరసనే కంటిన్యూ చేస్తాడా..


ఈ నెల 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం విడుదల కాబోతోంది. తమ సొంత బ్యానర్ లోనే నిర్మితమైన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఇండస్ట్రీలో చాలాయేళలుగా ఎడిటర్ గా పనిచేసిన ఇతను ఈ మూవీతోనే దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుత టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. విలన్ పాత్రలో సముద్రఖని కనిపిస్తున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి అనే కలెక్టర్ పాత్రలో నితిన్ నటించాడు. ఇలాంటి పాత్ర చేయడం నితిన్ కు ఫస్ట్ టైమ్. ఆ మధ్య ఓ ఫంక్షన్ లో ఇకపై లవ్ స్టోరీస్ చేయను అని చెప్పాడు. అందుకే ఇలాంటి మాస్ మూవీకి ఓకే చెప్పి ఉంటాడని అంతా అనుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూశాక ఓ కమర్షియల్ మీటర్ లో పెట్టి తీసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడీ మీటర్స్ కు కాలం చెల్లింది. మరీ అవుట్ స్టాండింగ్ అనిపిస్తే తప్ప ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయలేరు.

అ ఆ మూవీ తర్వాత నితిన్ ఏడు సినిమాలు చేశాడు. వీటిలో భీష్మ ఒక్కటే హిట్. మిగతావన్నీ పోయాయి. చివరికి ఓటిటిలోనే వచ్చిన మేస్ట్రో కూడా మెప్పించలేకపోయింది. అందుకే నితిన్ పై ఎక్కువ ఒత్తిడి ఉంది. దాన్ని కవర్ చేస్తూ ప్రమోషన్స్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నా.. ఓ రకంగా ఇది చాలెంజింగ్ టైమ్. అటు లవ్ స్టోరీస్ కు ఏజ్ దాటి పోయింది. ఇటు మాస్ హీరోగా నిలబడేందుకు మాచర్ల మూవీ విజయం కీలకం. అందుకే నితిన్ కెరీర్ కు లిట్మస్ టెస్ట్ లాంటి మూవీ మాచర్ల నియోజకవర్గం. పోటీ ముందు రోజు లాల్ సింగ్ చడ్డా ఉన్నాడు. తర్వాత రోజు కార్తికేయక2 ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా నెక్ట్స్ డే కే కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. సో.. మొదటి ఆటకే హిట్ అనే మాట వినాలి. లేదంటే మాచర్ల నియోజకవర్గానికి డిపాజిట్స్ కూడా దక్కవు అంటోంది టాలవుడ్

Related Posts