ఎంద‌రికో స్ఫూర్తి… రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌జీవితం!


ఆ రోజుల్లో ఆర‌డుగుల ఎత్తు, భారీ విగ్ర‌హంతో అల‌రించిన ఏకైక హీరో కృష్ణంరాజు. ఆయ‌న పేరు విన‌గానే కొంద‌రిలో ఉత్సాహం ఉర‌క‌లు వేసేది, కొంద‌రు జ‌డుసుకొనేవారు, మ‌రికొంద‌రికి ఆయ‌న అభిన‌యం ఆనందం పంచేది. ఇంకొంద‌రిని ఆయ‌న న‌ట‌న మురిపించేది. ఆరంభంలోనే కె.ప్ర‌త్య‌గాత్మ రూపొందించిన‌చిల‌క‌-గోరింక‌(1966)తో హీరోగా తెర‌పై త‌ళుక్కుమ‌న్నారు కృష్ణంరాజు. అయితే ఆ త‌రువాత క‌థానాయ‌కునిగా నిల‌దొక్కుకోవ‌డానికి కృష్ణంరాజు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డార‌నే చెప్పాలి. దాదాపు ప‌దేళ్ళ‌కు కృష్ణంరాజు స్టార్ డ‌మ్ చూశారు. జ‌నం మ‌దిలో రెబ‌ల్ స్టార్గా నిలిచారు.

తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్ డ‌మ్ కోసం దాదాపు పుష్క‌ర‌కాలం ప్ర‌య‌త్నాలు సాగించి, విజేత‌లుగా నిల‌చిన‌వారు ఇద్ద‌రే ఇద్ద‌రు- వారు శోభ‌న్ బాబు, కృష్ణంరాజు. ఈ ఇద్ద‌రు హీరోల‌ను అప్ప‌ట్లో య‌న్టీఆర్, ఏయ‌న్నార్ బాగా ప్రోత్స‌హించారు. వారిచిత్రాల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ త‌మ ఉనికిని చాటుకున్నారు. అయినా స్టార్ డ‌మ్ చేరుకోవ‌డానికి చాలా ఏళ్ళు ప‌ట్టింది. శోభ‌న్ బాబు హీరోగా, సైడ్ హీరోగా, కేరెక్ట‌ర్ యాక్ట‌ర్ గా సాగుతూ చివ‌ర‌కు తాసిల్దార్ గారి అమ్మాయితో స్టార్ డ‌మ్ చూశారు. అయితే కృష్ణంరాజుకు హీరోవేషాలు అంత‌గా ద‌క్క‌లేదు. అయినా కృష్ణంరాజు నిరాశ చెంద‌లేదు. త‌న‌కు ల‌భించిన విల‌న్ రోల్స్ లోనూ అద్భుతంగా న‌టించి మెప్పించారు. ఆ రోజుల్లో కృష్ణంరాజును విల‌న్ గా తెర‌పై చూసిన మ‌హిళా ప్రేక్షకులు ఆయ‌న పేరు చెప్ప‌గానే జ‌డుసుకొనేవారు. అలాంటి కృష్ణంరాజు ఆ ముద్ర నుండి బ‌య‌ట ప‌డ‌డానికి కృష్ణ‌వేణి, అభిమాన‌వంతులు, మేమూ మ‌నుషుల‌మే వంటి చిత్రాల‌లో సాఫ్ట్ కేరెక్ట‌ర్స్ పోషించారు. ఈ చిత్రాల‌లోకృష్ణ‌వేణి మిన‌హా ఏ చిత్ర‌మూ విజ‌యం సాధించ‌లేదు.

అయినా మెల్ల‌గా కృష్ణంరాజును కూడా హీరోగా చూడ‌డానికి జ‌నం అల‌వాటు ప‌డేలా చేసుకున్నారు. ఆ త‌రువాత భ‌క్త క‌న్న‌ప్ప‌తో న‌టునిగా జ‌నం మెదిని మెప్పించ‌డ‌మే కాదు, స్టార్ డ‌మ్ నూ సొంతం చేసుకున్నారు. అమ‌ర‌దీపం చిత్రంతో నంది అవార్�