అడవి శేష్ ‘గూఢచారి 2‘లో ఇమ్రాన్ హష్మీ

బాలీవుడ్ సీనియర్ హీరోలు ఒక్కొక్కరిగా టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. ఈ లిస్టులో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా ఉన్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘లో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్.. లేటెస్ట్ గా మరో టాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అడవి శేష్ ‘గూఢచారి‘ సీక్వెల్ ‘గూఢచారి 2‘లో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’తో విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నాడు ఇమ్రాన్. అయితే.. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘టైగర్ 3‘ ఆశించిన విజయాన్ని సాధించలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజి’లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ లుక్ ని సరికొత్తగా డిజైన్ చేశాడట డైరెక్టర్ సుజీత్. ఇప్పుడు ‘గూఢచారి‘ సీక్వెల్ ‘G2‘లోనూ ఎంతో విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నాడట ఇమ్రాన్. వెల్కమ్ టు ది మిషన్ ఇమ్రాన్ హష్మీ అంటూ ‘G2‘ టీమ్ ఈ బాలీవుడ్ రొమాంటిక్ హీరోకి స్వాగతం పలుకుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Related Posts