దస’రా’ టీజర్.. రా, రస్టిక్

నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ చిత్రాల హీరోగా మంచి పేరున్న నాని ఎందుకో ఆ ఇమేజ్ ను మార్చుకోవాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ చేయనటువంటి ఊరమాస్ గెటప్ తో దసరా అనౌన్స్ అయినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ మేకోవర్ అతనికి హిట్ ఇస్తుందా అని అనుమానాలూ వ్యక్తి చేశారు. బట్ నాని మాత్రం ఈ మూవీపై చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ రిలీజ్ ముందు కూడా నాని .. శ్రీకాంత్ ఓదెల.. గుర్తించుకోండి ఈ పేరు అంటూ చేసిన ట్వీట్ అంచనాలు పెంచింది. మరి ఈ టీజర్ ఎలా ఉందీ అంటే..


ముందు నుంచీ చెబుతున్నట్టే ఇది సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో సాగే కథ. ఈర్లపల్లి అనే ఊరికి చెందిన వ్యక్తుల కథ అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ” ఈర్లపల్లి .. సుట్టూరా బొగ్గుకుప్పలు.. తొంగి జూత్తెగాని కనిపియని ఊరు. మందంటే మాకు యసనంగారు.. అలవాటుబడిన సంప్రదాయం.. నీయవ్వ ఎట్లైతే గట్ల, గుండుగుత్తగ లేపెద్దం బాం..త్ ” అనే డైలాగ్స్ తో ఉన్న ఈ టీజర్ లో ఓ రేంజ్ ఇంటెన్సిటీ కనిపిస్తోంది. నానితో పాటు మళయాల నటుడు షన్ టామ్ చాకో, సాయికుమార్ మాత్రమే ఎక్కువగా కనిపించారు. హీరోయిన్ కీర్తి సురేష్ కు సంబంధించి ఒక్క షాట్ కూడా లేదు. కానీ ఈ కొత్త దర్శకుడి మేకింగ్ మాత్రం టాక్ ఆఫ్ ద టౌన్ లా ఉంది. షాట్ డివిజన్, మేకింగ్ స్టైల్ చూస్తోంటే అతను ఫస్ట్ మూవీ చేశారు అంటే నమ్మలేం. ఆ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా టీజర్ చివరి షాట్ మాత్రం నాని నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం. అద్భుతం అనొచ్చు. మొత్తంగా ఈ సారి దసరా మార్చిలో వస్తుంది అని టీజర్ లో చెప్పినట్టు.. దసరా మూవీ ఆకట్టుకునేలా ఉంది. నాని ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్, కాంతార చిత్రాల్లా మాట్లాడుకుంటారు అని చాలా పెద్ద మాట అనేశాడు. మరి అతని కాన్ఫిడెన్స్ వెనక ఎంత స్టఫ్‌ ఉందో సినిమా చూస్తే కానీ తెలియదు.

Related Posts