ముఠామేస్ట్రీ, స్టేట్ రౌడీ కలిపితే చిరంజీవి కొత్త్త సినిమా..?

మెగాస్టార్ చిరంజీవి మూవీ లైనప్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ వయసులో కూడా ఒక్క రోజూ రెస్ట్ లేకుండా వరుసగా షూటింగ్స్ చేస్తూ యంగ్ స్టర్స్ కు సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా ఆయన ఇప్పుడు మూడు సినిమాల చేస్తున్నాడు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ తో పాటు బాబీ డైరెక్షన్ లో వస్తోన్న సినిమా. మొదట ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’అనే టైటిల్ అనుకున్నారు. కానీ టైటిల్ బాలేదనే టాక్ రావడంతో మార్చారు. కొత్త టైటిల్ వాళ్లే అనౌన్స్ చేస్తామని రీసెంట్ గా సోషల్ మీడియాలో చెప్పారు. ఇక ఈ మూడు సినిమాలకు సంబంధించి మెగాస్టార్ ఒక్కో చిత్రానికి పది రోజుల చొప్పున టైమ్ కేటాయించి.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇందుకోసం దర్శకులు కూడా ముందుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో రెడీగా ఉన్నారు. దీంతో ఈ మూడు సినిమాలూ వచ్చే యేడాదే ఖచ్చితంగా విడుదలవుతాయని బలంగా చెబతున్నారు. ఇక వీటిలో బాబీ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి.
ఈ చిత్రం వైజాగ్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఈ పోర్ట్ లో లేబర్ పనిచేసే నాయకుడుగా చిరు కనిపిస్తారని అంటున్నారు. అంటే ముఠామేస్త్రీ సినిమాలో కూరగాయల మార్కెట్ తరహా పాత్రలా ఉంటుందట. అలాంటి పాత్ర సడెన్ గా ఓ భారీ ట్విస్ట్ తో పోలీస్ గా ఎంట్రీ ఇస్తుంది అంటున్నారు. ఇది అచ్చంగా ఆయన నటించిన స్టేట్ రౌడీలోని పాత్ర. ఈ పాత్రను చాలామంది పోకిరి చిత్రంతో పోలుస్తున్నారు. కానీ అది తప్పు. పోకిరీయే స్టేట్ రౌడీకి కాపీ. అందువల్ల మెగాస్టార్ రెండు సినిమాల్లోని పాత్రలను కలిపి ఓ కొత్త కథ తయారు చేశాడట బాబీ. చూస్తోంటే ఇది నిజంగానే వర్కవుట్ అయ్యేలా ఉంది. ఇలాంటి పాత్రల్లో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఆయన అభిమానులకే కాదు.. కామన్ ఆడియన్సెస్ కు కూడా తెలుసు. ఈ వయసులో అలాంటి మాసివ్ ఎంటర్టైనర్ అంటే మెగాస్టార్ ఎలా రెచ్చిపోతారో కూడా ఊహించొచ్చు.
ఏదేమైనా ఇదీ కథ అని చాలా ముందుగానే ఊహించి రూమర్స్ రావడం ఆశ్చర్యమే. కానీ ఇదే కథ అయితే మాత్రం మరో ప్రమాదం కూడా ఉంది. బాబీ ఈ కథనాన్ని ఈ కాలం ప్రేక్షకుల అభిరుచికీ తగ్గట్టుగా రూపొందించాల్సి ఉంటుంది. మరి ఏ మేరకు అలాంటి మార్పులు చేశారో చూద్దాం.

Related Posts