అఖండ విజయంతో అల్లు అర్జున్ సంబరాలు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ టైటిల్ కు తగ్గట్టుగానే అఖండ విజయం సొంతం చేసుకుని దూసుకుపోతోంది. టాలీవుడ్ నుంచి 2021లోనే హయ్యొస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డ్ నూ క్రియేట్ చేసింది అఖండ. బోయపాటి, బాలయ్య కాంబోపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ.. గత రెండు సినిమాలకు మించిన విజయం అనిపించుకుంటోంది అఖండ. రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా అఘోరాగా అతని ఆహార్యం, ఆంగికం, వాచకం, అభినయం నెక్ట్స్ లెవెల్ అనేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త సాధారణంగా సాగినా.. అఘోరా ఎంట్రీ తర్వాత సినిమా టాప్ గేర్ లోకి వెళ్లిపోయింది. హై స్పీడ్ ట్రైన్ లా తమన్ నేపథ్య సంగీతం అందిస్తే.. అందుకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టాడు బాలయ్య.
ఇక అఖండ సినిమా సాధించిన విజయంతో అల్లు అర్జున్ ఇంటిలో సంబరాలు మొదలయ్యాయి. విడుదలైన తర్వాత మొదటి ఆటకే అల్లు అర్జున్ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. అందుకు కారణం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్లడమే. ఆ టైమ్ లో చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు బన్నీ. ఈ కారణంగా బాలయ్య ఫ్యాన్స్ కూడా బన్నీని బాగా ఇష్టపడ్డారు. తను చీఫ్ గా గెస్ట్ గా వెళ్లిన సినిమా అద్బుత విజయం సాధించడంతో పాటు ఇప్పటి వరకూ కాస్త స్టబ్దుగా ఉన్న పరిశ్రమకు కొత్త జోష్ ను తెచ్చింది కాబట్టే అల్లు అర్జున్ ఈ మూవీ విజయంపై ఖుషీగా పార్టీ చేసుకున్నాడు.
మరోవైపు అఖండ సాధించిన రికార్డ్ ను పుష్ప చిత్రం తుడిచేసే అవకాశం కూడా ఉంది. మొదటి రోజు హయ్యొస్ట్ గ్రాసర్ అనే ఆ రికార్డ్ ను తిరగరాయడం ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదలవుతోన్న పుష్పకు అంత కష్టమేమీ కాదు. ఏదేమైనా అఖండ విజయంతో అల్లు అర్జున్ సంబరాలు చేసుకోవడం ఇద్దరు హీరోల అభిమానుల్ని మరింత ఖుషీ చేస్తోందనే చెప్పాలి.

Related Posts