రంగబలి ట్రైలర్.. సొంతూళ్లో సింహంలా ఉండాలి

నాగశౌర్య లేటెస్ట్ మూవీ రంగబలి. యుక్తితరేజా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి పవన్ బాసంశెట్టి దర్శకుడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో మంచి ఇంప్రెషన్ వేసింది ఈ మూవీ టీమ్. ప్రమోషన్స్ లో కూడా హిలేరియస్ ప్లానింగ్స్ తో ముందుకు వెళుతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూడగానే నాగశౌర్య కు హిట్ పడ్డట్టే అనిపిస్తే అతిశయోక్తేం కాదు. అలా ఉంది. ఓ మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కామెడీ, లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్.. ఇలా అన్నీ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ సినిమాలో కూడా ఇదే పాళ్లల్లో ఉంటే హిట్ గ్యారెంటీ.

సొంత ఊరంటే ఎంతో పిచ్చి ఉన్న ఓ కుర్రాడి కథ ఇది. ‘ మీ ఊరంటే నీకిష్టమా’ అని మురళీ శర్మ అడిగిన డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ మొత్తం కలర్ ఫుల్ గా ఉందనే చెప్పాలి. బయట ఊరిలో బానిసలా బ్రతికినా ఫర్వాలేదు. కానీ సొంత ఊళ్లో సింహంలా ఉండాలి అనేది హీరో ఫీలింగ్ లా ఉంది. తను పుట్టిన ఊరిలోనే పండగ అయినా పాడె అయినా అనేది అతని సిద్ధాంతం. అయితే ఆ ఊరిలోనూ ఓ బ్యాక్ గ్రౌండ్ ఉన్న విలన్ ఉంటాడు.

ఆ విలన్ కు ఎదురెళ్లే హీరో లైఫ్ లో ఎన్ని మార్పులు వచ్చాయి అనేది పాయింట్. ఈ పాయింట్ కొత్తదేం కాదు. బట్ వీళ్లు కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినట్టు.. దానికి అద్భుతమైన వినోదాన్ని జోడించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రోడ్డుపక్కన తేనెలాగా స్పెర్మ్ డొనేషన్ చేద్దాం అనే సత్య డైలాగ్ బలే కామెడీగా ఉంది. సత్య క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. తమిళ్ నటుడు శరత్ కుమార్ ఓ గెస్ట్ రోల్ చేసినట్టున్నాడు. దసరా ఫేమ్ మళయాలీ నటుడు షన్ టామ్ చాకో విలన్ గా కనిపిస్తున్నాడు.

హీరోయిన్ ఒక పేపర్ లో ఏదై