ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో సినిమా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల లిస్ట్ రోజు రోజుకూ పెరిగిపోతుంది. ‘సలార్‘ డిసెంబర్ లో రాబోతుండగా.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 ఎ.డి‘ ఉంది. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. వచ్చే యేడాదే మారుతి సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయ్యే అవకాశాలున్నాయి. వీటితో పాటు సందీప్ రెడ్డి తో ‘స్పిరిట్‘ కూడా ఉంది. అయితే.. సందీప్ రెడ్డి సినిమా ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ గా ప్రభాస్ కిట్టీలో మరో సినిమా చేరింది. ‘సీతారామం‘తో విజయాన్ని మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘సీతారామం‘ సినిమాకి మిలటరీ టచ్ ఇచ్చిన హను రాఘవపూడి.. ప్రభాస్ తో సినిమాని రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించనున్నాడట. అలాగే తన మార్క్ లవ్ స్టోరీని కూడా ఇందులో చూపించనున్నాడట హను రాఘవపూడి.

యు.వి.క్రియేషన్స్ తో కలిసి ఓ బాలీవుడ్ పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాని నిర్మించనుందట. పాన్ వరల్డ్ రేంజులో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే.. ప్రభాస్-హను రాఘవపూడి సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts