హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ప్రభాస్ ఎంట్రీ

టాలీవుడ్ మూవీస్ ఇప్పుడు హాలీవుడ్ స్టాండార్డ్స్ లో ఉంటున్నాయి. ‘బాహుబలి’తో మొదలైన పాన్ ఇండియా ట్రెండ్.. ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజుకు చేరుకుంది. ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ కాన్సెప్ట్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు మన మేకర్స్. ఈకోవలోనే రాబోతున్న చిత్రం ‘కల్కి 2898 ఎ.డి.’. రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ నుంచి తాజాగా ‘బుజ్జి’ని పరిచయం చేసింది టీమ్.

‘కల్కి’ సినిమాలో భైరవ పాత్రలో కనిపించే ప్రభాస్ కి ఫేవరెట్ వెహికల్ బుజ్జి. ఈ బుజ్జి పరిచయ వేడుకను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు.

ఇక.. ఈ వేడుకలో హాలీవుడ్ హీరోలను తలదన్నే మేకోవర్ తో అసలుసిసలు సూపర్ హీరోలా ఫంక్షన్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. బుజ్జి వెహికల్ ను నడుపుకుంటూ గ్రౌండ్ లోకి సూపర్ హీరో సూట్ లో వచ్చిన ప్రభాస్ ఎంట్రీ అయితే అదుర్స్ అని చెప్పాలి. జూన్ 27న ‘కల్కి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts