ఓటీటీ లోకి వచ్చేసిన అమీర్ ఖాన్ తనయుడి చిత్రం

హిందీ చిత్ర సీమలో ఖాన్ త్రయం సల్మాన్, షారుక్, అమీర్ ఖాన్ లది ప్రత్యేక అధ్యాయం. ఇక.. వీరిలో నటన పరంగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు అమీర్ ఖాన్. బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్ వారసుడొచ్చాడు. ఆయన తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం ‘మహారాజ్’.. ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

1862 నాటి మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా.. వాస్తవ సంఘటనలతో రూపొందిన చిత్రం ‘మహారాజ్’. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఒక పూజారి కథతో ఈ సినిమా సాగుతోంది. ఈ మూవీలో జైదీప్ అహ్లావత్, షాలిని పాండే, శర్వరి ఇతర కీలక పాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సిద్ధార్థ్ పి మల్హోత్రా ఈ సినిమాని తెరకెక్కించాడు.

అయితే.. ఈ సినిమాలో హిందూ మతాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయని.. విడుదలకు ముందే తమకు సినిమాని చూపించాలని విశ్వ హిందూ పరిషత్.. నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ కు లేఖ రాసింది. ఈ విషయం కోర్టు వరకూ వెళ్లడంతో.. ‘మహారాజ్‘ రిలీజ్ ఆగింది. లేటెస్ట్ గా గుజరాత్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నెట్ ఫ్లిక్స్ లో ‘మహారాజ్‘ మూవీ స్ట్రీమింగ్ మొదలయ్యింది.

Related Posts