ఎన్టీఆర్ సైమా స్పీచ్ టిడిపికి కౌంటరా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డ్ కు ఎంపికయ్యాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నటనకు గానూ 2022 బెస్ట్ యాక్టర్ గా సైమా ఎన్టీఆర్ ను ఎంపిక చేసింది. ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. నిజానికి ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ వస్తుందనే భావించారు చాలామంది. అది రాలేదు. ఇక మిగతావన్నీ ఎన్టీవోడు లేదా రామ్ చరణ్ కే అవుతాయని చాలామంది అనుకుంటున్నారు. అలాగే సైమా అవార్డ్ ను రెండోసారి అందుకున్నాడు ఎన్టీఆర్. ఇంతకు ముందు జనతా గ్యారేజ్ చిత్రానికీ బెస్ట్ యాక్టర్ గా సైమా అందుకున్నాడు.

అయితే ఈ వేదికపై ఆయన చేసిన స్పీచ్ చూస్తే అది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అతని గురించి జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ లా ఉందనిపిస్తుందంటున్నారు చాలామంది. నిజంగా ఎన్టీఆర్ మాటల్లో దిట్ట. సమయానుకూలంగా మాట్లాడతాడు. ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలనుకున్నది చెబుతాడు.


చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో అతన్ని తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం టార్గెట్ చేస్తూ విపరీతంగా నిందిస్తోంది. అయినా అతను ఏమీ రియాక్ట్ కాలేదు. ఇంకా చెబితే కొన్నాళ్లుగా టిడిపి, నందమూరి ఫ్యామిలీ ఆయన్ని దూరం పెట్టిందని అందరికీ తెలుస్తోంది. కానీ వాళ్లు మాత్రం ఈయనే దూరమయ్యాడు అనే ప్రచారం చేస్తున్నారు. నిజాలేంటీ అని వారికి మాత్రమే తెలుసు. బట్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ రగిలిపోతోంది. ఆయన అరెస్ట్ కావడం కంటే ఈయన స్పందించలేదు అనే బాధే ఎక్కువగా కనిపించింది. దీనికి తోడు ఇక్కడ ఇంత జరుగుతుంటే అతను దుబాయ్ లో అవార్డ్ ఫంక్షన్ కు వెళతాడా అనే కౌంటర్స్ కూడా పడుతున్నాయి. వారికి కాదు.. కానీ ఆ విమర్శలకు సమాధానంగానా అన్నట్టుగా ఎన్టీఆర్ స్పీచ్ లో ఒక భాగం కనిపిస్తోంది.


“నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు..” ఇదీ ఆయన మాటల్లో ఒక భాగం. ఇవి చూస్తే అర్థం కావడం లేదూ.. తనను పార్టీ వాళ్లు ఎంత బాధపెట్టినా.. అభిమానులే తన బలం అని చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. మొత్తంగా దీనిపైన కూడా కౌంటర్స్ వస్తాయోమో చూడాలి.

Related Posts