‘దేవర’ కోసం ఎన్టీఆర్ ఎనర్జిటిక్ స్టెప్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ ప్రస్తుతం పాట చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ సినిమాకోసం థాయ్‌లాండ్ లో ఓ హై ఎనర్జిటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక.. ఈ పాటను కంపోజ్ చేస్తుంది బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్. ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తారక్ తో కలుసున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బాస్కో మార్టిస్.

రెండు భాగాలుగా రానున్న ‘దేవర’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని.. సెప్టెంబర్ 27న ‘దేవర’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కనిపించబోతున్నాడు. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్న ‘దేవర’ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది. త్వరలో రెండో పాటను విడుదల చేయబోతున్నారు.

Related Posts