శ్రీకాకుళంలో పూర్తైన ‘తండేల్’ షూటింగ్

అక్కినేని నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ‘తండేల్’. ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘100 పర్సెంట్ లవ్’ తర్వాత గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య నటిస్తున్న సినిమా ఇది. ఇక.. ఇప్పటికే చైతన్యకి ‘ప్రేమమ్’ వంటి బడా హిట్ ఇచ్చిన చందూ మొండేటి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అలాగే.. తన ‘లవ్ స్టోరీ’ భామ సాయిపల్లవి ఈ సినిమాలో చైతన్యకి జోడీగా నటిస్తుంది.

పలు హిట్ కాంబోస్ లో పాజిటివ్ వైబ్స్ తో రూపొందుతోన్న ‘తండేల్’ చిత్రం ఆద్యంతం మత్స్యకారుల ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. ఈకోవలోనే.. ఇటీవల శ్రీకాకుళంలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు మొదలుపెట్టారు.

హీరోహీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవి ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. తాజాగా.. శ్రీకాకుళం షెడ్యూల్ పూర్తయ్యిందట. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘తండేల్’ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts