‘కల్కి‘ టిక్కెట్ రేట్లకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి‘ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పాన్ వరల్డ్ రేంజులో నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమాకోసం టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు ఇప్పటికే వినతి పత్రాలు సమర్పించింది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.

లేటెస్ట్ గా.. ‘కల్కి‘ మూవీ స్పెషల్ షో లకు, టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ‘కల్కి‘ మూవీ బెనిఫిట్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు.. రూ.377 గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్ లకు ఈ రేట్లు రూ.495 గా ఉండనున్నాయి. ఇక.. రెగ్యులర్ షోల రేట్ల విషయానికొస్తే.. సింగిల్ స్క్రీన్ థియేటర్ కి రూ.265, మల్టీప్లెక్స్ రూ.413 గా ఉండబోతున్నాయి.

ఇంకా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ‘కల్కి‘ టిక్కెట్ రేట్లు పెంచుకునే విషయంపై ఈ రెండు, మూడు రోజుల్లోనే అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 27న ‘కల్కి‘ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts