డ్రగ్స్ కేస్ లో నవదీప్ కష్టాలు

చిన్న వయసులోనే హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు నవదీప్. తేజ పరిచయం చేస్తే స్టార్స్ అవుతారు అన్న ట్రెండ్ కు బ్రేక్ పడింది కూడా నవదీప్ తోనే. అతను హీరోగా పరిచయం అయిన జై సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కూడా హీరోగా కొనసాగాడు. బట్ బ్లాక్ బస్టర్స్ పడలేదు. మంచి అందగాడుగా ఉన్నా.. టాలెంట్ కూడా ఫర్వాలేదనిపించుకున్నా.. హీరోగా నిలబడలేకపోయాడు. క్రమంలో ఇతర పాత్రలవైపు వచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గానూ నటిస్తూ వస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో ఎప్పుడు డ్రగ్స్ కు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చినా.. ఖచ్చితంగా నవదీప్ పేరు తెరపైకి వస్తుంది.

అతను ఒకప్పుడు పబ్ ను నిర్వహించేవాడు. ఆ పబ్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులో ఉండేవనే ప్రచారంతో పోలీస్ లు గట్టి నిఘా పెట్టి అతని పబ్ కు చెక్ పెట్టారు. అయినా ఈ వ్యవహారంలో నవదీప్ పేరు ఆగలేదు. తాజాగా మరోసారి అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీస్ లు చెప్పారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.


తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేస్ మళ్లీ టాలీవుడ్ ను చుట్టుకుంది. ఈ కేస్ లో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నాడనేందుకు తమ వద్ద పక్కాగా ఆధారాలున్నాయని నగర కమీషన్ సివి ఆనంద్ తెలిపాడు. ఇదే కేస్ లో మరో నిందితుడుగా ఉన్న మాజీ ఎం.పి కుమారుడు దేవరకొండ సురేష్ ను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. నవదీప్ తో పాటు మరికొందరు పరారీలో ఉన్నారని.. వారందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని సివి ఆనంద్ తెలిపాడు.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ నవదీప్.. సినిమా నటుడు నవదీప్ ఒక్కరే కాదు. ఆ విషయం బయటకు వచ్చిన వెంటనే నవదీప్ ట్విట్టర్ లో స్పందించాడు. అది నేను కాదు. నేను ఇక్కడే ఉన్నాను. దయచేసి ఈ విషయంలో ఓ క్లారిటీ తీసుకోండి అంటూ ట్వీట్ చేయడంతో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. కొన్నిసార్లు పేర్లు కనెక్ట్ అయితే చాలు.. మనవాళ్లు వెంటనే అల్లుకుపోతారు..

Related Posts