‘భారతీయుడు 2’ పాటలకు మిక్స్‌డ్ రెస్పాన్స్

భారతీయ చిత్ర పరిశ్రమలో ‘భారతీయుడు’ సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోతుంది. 1996లో విడుదలైన ఈ చిత్రం ఇండియా నుంచి ఆస్కార్ కి అఫీషియల్ ఎంట్రీగా నిలిచింది. అయితే.. ఫైనల్ లిస్ట్ లో నామినేట్ అవ్వలేదు. అలాగే.. ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు అందుకుంది. వాటిలో ఉత్తమ జాతీయ నటుడిగా కమల్ హాసన్ కూడా నిలిచాడు. అలాంటి క్లాసిక్ ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న మూవీయే ‘భారతీయుడు 2’.

తమిళంలో ‘ఇండియన్ 2’గా రూపొందిన ఈ సినిమా తెలుగులో ‘భారతీయుడు 2’గా అనువాదమవుతోంది. జూలై 12న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా ‘ఇండియన్ 2’ తమిళ ఆడియోను రిలీజ్ చేశారు. మొత్తం ఆరు పాటలు గల ఈ ఆల్బమ్ నుంచి గతంలోనే రెండు పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు మొత్తం పాటల్లో రెండు, మూడు పాటలు ఫర్వాలేదనిపిస్తే.. మిగతా వాటికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. గతంలో ‘భారతీయుడు’ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆ పాటలన్నీ చార్ట్ బస్టర్స్. ఇప్పుడు ఈ సీక్వెల్ కి అనిరుధ్ స్వరకల్పన చేశాడు. సినిమా విడుదలయ్యే లోపు ‘ఇండియన్ 2’ సాంగ్స్ మరింత ఊపందుకుంటాయేమో చూడాలి.

Related Posts