విల్లు ఎక్కుపెట్టిన విష్ణు.. ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పలు భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కువభాగం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈరోజు విష్ణు బర్త్ డే (నవంబర్ 23) స్పెషల్ గా ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ప్రకృతితో మమేకమైన ప్రదేశంలో.. మహాశివలింగం ముందు విష్ణు విల్లు ఎక్కుపెట్టిన ఈ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక మైలురాయి అవుతుందని విష్ణు చెబుతున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్ లతో పాటు పలు భాషలకు సంబంధించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి సీనియర్ యాక్టర్స్ కీ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌ టైన్‌ మెంట్ బ