‘కల్కి’ మూవీ రివ్యూ

నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శోభన, పశుపతి, సస్వత ఛటర్జీ తదితరులు
సినిమాటోగ్రఫి: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: స్వప్న దత్, ప్రియాంక దత్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
విడుదల తేది: 27-06-2024

రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కల్కి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పది వేలకు పైగా స్క్రీన్స్ లో ‘కల్కి’ గ్రాండ్ గా రిలీజైంది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ దీపిక పదుకొనె, దిశా పటాని.. ఇంకా మరెంతోమంది నటీనటులు, అతిథి నటులతో భారీ అంచనాల నడుమ ‘కల్కి’ విడుదలైంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నాలుగేళ్ల నిరీక్షణకు ఫలితం ‘కల్కి’. ప్రతిష్ఠాత్మక వైజయంతీ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘కల్కి’ ఎలా ఉంది? అభిమానులను మెప్పిస్తోందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

ఈ సినిమాకోసం ఫ్యూచర్ వరల్డ్ లోని ‘కాశీ’తో పాటు శంభాల, కాంప్లెక్స్ అనే నగరాలను సృష్టించాడు నాగ్ అశ్విన్. ఈ ఫ్యూచర్ సిటీస్ తో పాటు.. పురాణ గాథ మహాభారతాన్ని ఆవిష్కరించాడు. మహాభారతం సన్నివేశాలతో పాటు.. కాశీ, శంభాల, కాంప్లెక్స్ నగరాలకు సంబంధించిన వ్యక్తులు, వారి ఆహార్యం, వారి వాడే వస్తువులు అన్నింటినీ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసి ‘కల్కి’ని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్.

సినిమా విషయానికొస్తే.. ‘కల్కి’ ఓ విజువల్ ఎపిక్ ఎక్స్‌ట్రావాగాంజా అని చెప్పాలి. గ్రాండ్ ఫిల్మ్ మేకింగ్ అనే దానికి అసలు సిసలు నిర్వచనం ‘కల్కి’. ఈ సినిమా ప్రతీ ఒక్కిరికీ ఎక్స్‌ట్రార్డినరీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలోని చాలా గూస్‌ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో స్టోరీ ఫ్లాట్ నేరేషన్ లో వెళ్తోంది అనిపించినా.. వెంటనే ఓ గూస్‌బంప్ మూమెంట్ రావడం సినిమా హైప్ ను పెంచేయడం జరుగుతోంది.

ఫస్టాఫ్ లో తొలి ఐదు నిమిషాలు సినిమా కథలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. అక్కడ నుంచి తాను సృష్టించిన ప్రాంతాలను పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు నాగీ. సినిమాలోని మైథలాజికల్ ఎపిసోడ్స్ కి అయితే వావ్ అనే రెస్పాన్స్ వస్తోంది. ఫస్టాఫ్ లో కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభాస్ లోని హ్యూమర్ యాంగిల్ ను సరికొత్తగా ఆవిష్కరించాడు. అలాగే.. బ్రహ్మానందం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

మొదటిభాగం సాఫీగా సాగుతూనే.. ఇంటర్వెల్ ఎపిసోడ్ కి మంచి ట్విస్ట్ వస్తోంది. అయితే.. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కాస్త స్లో నేరేషన్ లో జరుగుతోంది. కానీ.. ఆ తర్వాత మొదలవుతోంది అసలు సిసలు విజువల్ ఫీస్ట్. అక్కడ నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్ వరకూ ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ ను ఆవిష్కరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది.ప్రతీ సన్నివేశంలోనూ గ్రిప్పింగ్.. ఇంపాక్ట్ ఫుల్ సన్నివేశాలు సెకండాఫ్ లో పడ్డాయి. క్లైమాక్స్ సన్నివేశాలైతే ఇండియన్ సినిమాలోనే బెస్ట్ డిజైనింగ్ అని చెప్పొచ్చు. చివరి 15 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి.

నటీనటుల విషయానికొస్తే.. ముందుగా ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ లుక్స్ మళ్లీ ఆ రేంజులో కనిపించలేదని.. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ మేకోవర్ పై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. ఇక.. ‘సలార్’తో మళ్లీ గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన డార్లింగ్.. ‘కల్కి’తో మునుపటి ప్రభాస్ ని గుర్తుచేశాడు. ఆ ఎనర్జీ, హ్యూమర్, స్వాగ్, హీరోయిజమ్ అన్నీ ‘కల్కి’తో తిరిగొచ్చాయి. ప్రభాస్ క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ చూపించాడు నాగ్ అశ్విన్. హ్యూమర్ తో సాగుతూనే.. సినిమా ఎండింగ్ లో ఆ క్యారెక్టర్ ను మలిచిన విధానం ఆశ్చర్యం కలిగిలే ఉంటుంది.

ప్రభాస్ తర్వాత చెప్పుకోవాల్సింది అశ్వథ్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్. తొలి అర్థభాగంలో ప్రభాస్ కి సమానంగా కంటే కొన్ని సందర్భాల్లో మించి కూడా ఈ పాత్రను డిజైన్ చేశారు. అమితాబ్ ని అయితే ఇప్పటివరకూ స్క్రీన్ పై ఇలాంటి పాత్రలో చూడలేదు. అలాగే.. ఇన్ని ఎలివేషన్స్ తో ఇంత అద్భుతంగా మరే దర్శకుడు ఆవిష్కరించలేదు. విశ్వనటుడు కమల్ హాసన్ పాత్రను తాను తప్ప మరే నటుడూ పోషించలేడు. పోషించినా.. అంత ప్రాధాన్యత రాదు. మిగతా పాత్రల్లో దీపిక పదుకొనె తన బెస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఉన్న చాలా క్యారెక్టర్స్ వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. అతిథి పాత్రల్లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఆశ్చర్యపరుస్తారు.

సాంకేతిక విభాగాల విషయానికొస్తే.. ముందు నుంచీ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పై కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే.. సంగీతం, నేపథ్య సంగీతంపై అనుమానాలు మొదలయ్యాయి. వాటిన్నంటికీ ఈ సినిమాలో తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సమాధానం చెప్పాడు. అయితే.. పాటలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్ లో సంతోష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం.

యాక్షన్ కొరియోగ్రఫీ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ స్క్రీన్ అని చెప్పొచ్చు. కింగ్ సోల్‌మన్, ఆండీ లాంగ్, పీటర్ హెయిన్స్, సతీష్, అన్బారివ్, నిక్ పావెల్ వంటి ఎంతోమంది టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకి పనిచేశారు. విజువల్ ఎఫెక్ట్స్ అంటేనే ‘కల్కి’ అన్నట్టుగా ఈ సినిమాలోని విజువల్స్ ఉన్నాయి. వెటరన్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఆధ్వర్యంలో నిర్మాతలు స్వప్న, ప్రియాంక ఈ సినిమాకి ప్రాణం పెట్టేశారు. ప్రతీ సన్నివేశంలోనూ వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ వేల్యూస్ కనిపిస్తాయి.

మొత్తానికి.. ‘కల్కి’ అనేది ఇండియన్ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ ఆడియన్స్ కోసం వచ్చిన సినిమా అని చెప్పాలి. ఈ మూవీతో టాలీవుడ్ లో ఓ ఎపిక్ సినిమాటిక్ యూనివర్శ్ కి శ్రీకారం జరిగిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మన మైథలాజీని ఫ్యూచరిస్టిక్ వరల్డ్ తో ముడిపెడుతూ ‘కల్కి’ని తీర్చిదిద్దిన విధానం.. చాలా కొత్త పాయింట్. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని.. ప్రతీ విషయాన్ని ఎంతో డిటెయిల్డ్ గా చూపించాడు నాగీ. అందుకు నాగ్ అశ్విన్ విజన్ కి హ్యాట్సాప్ చెప్పాలి.

చివరగా
మొత్తానికి.. ప్రభాస్ నటన, విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ నా భూతొ నా భవిష్యతి అనే విధంగా ఉన్నాయి అందరిని మెప్పించడం లో నాగ్ అశ్విన్ సక్సెస్స్ అయ్యాడు …… కల్కి 2898 AD వర్తు వర్మ వర్తు….!

రేటింగ్:3.25/ 5

Related Posts