ఒకే వారం నాలుగు సినిమాలు విడుదల కావడం కొత్తేం కాదు. ఆ మాటకొస్తే కొత్తవాళ్ల సినిమాలైతే అరడజనుకు పైగా సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు వస్తే అందరికీ తలా ఇంత అవుతుంది. అప్పుడు ఎవరూ హ్యాపీగా ఉండలేరు అనేది సినిమా ట్రేడ్ థియరీ. అయినా వీళ్లు ఆగరు. కొన్ని డేట్స్ పోతే దొరకవు. మరికొన్ని డేట్స్ వదులుకుంటే కష్టం అవుతుంది. అందుకే ఒక్కోసారి పోలోమని ఒకే డేట్ పై పడుతుంటారు. అలా ఇప్పుడు సడెన్ గా యంగ్ స్టర్స్ అంతా సెప్టెంబర్ 28ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డేట్ లో రావాల్సిన సలార్ వాయిదా పడింది అని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో.. వెంటనే తమ సినిమాలను ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఒకరి తర్వాత ఒకరు అనౌన్స్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. కేవలం రెండు డబ్బింగ్ సినిమాలతో మాత్రమే పోటీ ఉన్న స్కంద కూడా నాలుగు సినిమాలతో పోటీ అంటూ సెప్టెంబర్ 28కి షిఫ్ట్ అయింది. మామూలుగా సెప్టెంబర్ 15నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
28న వస్తోన్న మరో క్రేజీ మూవీ మ్యాడ్. హారిక హాసిని నుంచి మరో కొత్త బ్యానర్ రూపొందింది. ఆ బ్యానర్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. అంతా కొత్తవాళ్లే నటించిన ఈ మూవీ టీజర్ కు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది.
ఇక ఒక్క హిట్ తో వరుస సినిమాలు చేస్తోన్న కిరణ్ అబ్బవరం కూడా అదే డేట్ లో వస్తున్నాడు. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమానుంచి వచ్చిన ఒక పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ శనివారం ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ ను బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది.
రిలీజ్ డేట్ తో సడెన్ గా సీన్ లోకి వచ్చిన సినిమా పెదకాపు1. శ్రీకాంత్ అడ్డాల తన ఇమేజ్ కు భిన్నంగా ఫస్ట్ టైమ్ కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటించిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి ఇంత తక్కువ టైమ్ లో వీళ్లు సాలిడ్ ప్రమోషన్స్ చేసుకుని సరిగ్గా అదే రోజు రావడం కాస్త ఛాలెంజింగే. అయినా ఆ డేట్ మిస్ అయితే మరో క్రేజీ డేట్ కు చాలా టైమ్ పడుతుంది. అయితే శ్రీకాంత్ ఈ చిత్రాన్ని 29న విడుదల చేయబోతున్నాడు.
ఈ డేట్ లోకి చివరగా వచ్చిన సినిమా స్కంద. 15 నుంచి పోస్ట్ పోన్ చేసుకుని మరీ ఈ పోటీలోకి వచ్చింది స్కంద. రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ఫస్ట్ మూవీ ఇది. శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. సినిమాకు ఆల్రెడీ భారీ బిజినెస్ అయింది. టేబిల్ ప్రాఫిట్స్ తో రిలీజ్ కాబోతోంది.
ఇక ఇవి కాక డబ్బింగ్ రూపంలో ది వాక్సిన్ వార్ వస్తోంది. నానా పాటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకుడు. ఇతను కశ్మీర్ ఫైల్స్ తో ఫేమ్ అయ్యాడు. అందుకే ఈ వాక్సిన్ వార్ పై ఒక వర్గం ఆడియన్స్ లో ఆసక్తి ఉంది.
మరి ఈ ఐదు సినిమాల్లో సాలిడ్ హిట్ అన్న టాక్ ఎవరు తెచ్చుకుంటారో కానీ.. అన్నీ డిఫరెంట్ జానర్స్ లోనే వస్తోన్న సినిమాలు కావడంతో సర్వత్రా ఒక ఆసక్తి కనిపిస్తోంది.