సర్కిల్ ట్రైలర్ ఎలా ఉంది..

నీలకంఠ.. ఒకప్పుడు విమర్శలను విపరీతంగా మెప్పించిన సినిమాలు తీశాడు. అతని అకౌంట్ లో నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ‘షో’ తో పాటు మిస్సమ్మ, విరోధి వంటి మంచి సినిమాలున్నాయి. బట్ కొన్నాళ్లుగా ట్రాక్ తప్పాడు. వరుసగా ఫ్లాపులు పడ్డాయి. దీంతో చాలా గ్యాప్ వచ్చింది. ఓ రకంగా ఈ తరానికి అతని ప్రతిభ తెలుసా అంటే డౌటే.

ఇలాంటి తరుణంలో ఈ తరం ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసుకుని త్వరలోనే ”సర్కిల్” అనే సినిమాతో వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సర్కిల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది.


ఓ ఫోటో గ్రాఫర్ లైఫ్‌ లో జరిగిన వివిధ సంఘటనల నేపథ్యంలో కథ కనిపిస్తోంది. మామూలుగా ఫోటో గ్రాఫర్ అనగానే అతని చుట్టూ అందమైన అమ్మాయిలు ఉంటారు కదా..? ఆ అమ్మాయిలతో పాటు అతనికి ఓ శతృవు కూడా చేరతాడు. మరోవైపు ఒన్ నైట్ స్టాండ్ అంటూ మెనీ నైట్స్ అతనితో గడిపే లేడీ కూడా ఉంటుంది. ఇంతమంది అమ్మాయిలతో పాటు ఆ ఒన్ నైట్ స్టాండ్ లేడీ అలాగే ఈ శతృవు వల్ల అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కోణంలో కనిపిస్తోంది ట్రైలర్ లో.

అయితే ”ఎవరు ఎప్పుడు ఎవరికి శతృవులు అవుతారో ఎవరికీ తెలియదు” అనే కీ పాయింట్ ప్రధానంగా ఉంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. రొమాన్స్ తో పాటు క్రైమ్, సస్పెన్స్ కూడా ఉంది. నేపథ్య సంగీతం ట్రైలర్ లో అయితే ఆకట్టుకునేలా ఉంది.


సాయి రోనక్ హీరోగా నటించిన ఈ మూవీలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఓ కీలక పాత్ర చేసినట్టు కనిపిస్తున్నాడు. అతని పాత్రే సినిమాలో హైలెట్ గా ఉంటుందనే టాక్ కూడా ఉంది. రిచా పనై, ఆశ్రిన్ మెహతా, నైనా ఫీమేల్ లీడ్ లో కనిపిస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. మొత్తంగా జూలై 7న విడుదల కాబోతోన్న సర్కిల్ తో నీలకంఠ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Related Posts