బాలకృష్ణ సినిమాలో దుల్కర్ సల్మాన్?

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. బాలయ్య 109వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఫస్ట్ షెడ్యూల్ లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఆ పాత్ర సినిమాలో కొన్ని కీలకమైన మలుపులకు కారణమవుతోందట. త్వరలోనే బాలయ్య మూవీలో దుల్కర్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు సోలో హీరోగా నటిస్తూనే మల్టీస్టారర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు దుల్కర్. ఇప్పటికే విశ్వనటుడు కమల్ హాసన్థగ్ లైఫ్‘లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు నటసింహం బాలకృష్ణతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది.

ఇక.. పేరుకు మలయాళీ అయినా.. ‘మహానటి, సీతారామం‘ సినిమాలతో తెలుగు హీరోలకు దీటుగా ఇక్కడ విజయాలందుకున్నాడు. ప్రస్తుతం తన మూడో స్ట్రెయిట్ తెలుగు చిత్రంగా ‘లక్కీ భాస్కర్‘ చేస్తున్నాడు. ‘సార్‘తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ మూవీకి డైరెక్టర్. ఈ సినిమాని కూడా బాలయ్య 109ని నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్సే నిర్మిస్తుంది. అలాగే ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘లోనూ దుల్కర్ కేమియోలో కనిపించబోతున్నాడనే ప్రచారం ఉంది.