కళ్లు మిరుమిట్లు గొలిపే కలర్ ఫుల్ సాంగ్ ‘జరగండి.. జరగండి..’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ నుంచి మోస్ట్ అవైటింగ్ ‘జరగండి.. జరగండి’ పాట వచ్చేసింది. ఈ పాట కోసం దాదాపు 16 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం జరిగింది. ఓ మినీ మూవీ బడ్జెట్ కి సమానమైన ఖర్చు ఇది. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వేసిన కలర్ ఫుల్ సెట్ లో.. లీడ్ పెయిర్ రామ్ చరణ్, కియారా అద్వానీలా మధ్య చిత్రీకరించిన ‘జరగండి.. జరగండి’ గీతం శంకర్ స్టైల్లో అత్యంత భారీతనంతో కళ్లు మిరుమిట్లు గొలిపే కలర్ ఫుల్ విజువల్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కంపోజిషన్ లో చరణ్, కియారా పై చిత్రీకరించిన మాస్ స్టెప్స్ కూడా ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. తమన్ స్వరకల్పనలో ‘జరగండి.. జరగండి.. జరగండి.. జాబిలమ్మ జాకెట్ వేసుకొని వచ్చెనండి’ అంటూ అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ ఆలపించారు

Related Posts