అల్లు అర్జున్ – రష్మిక ప్రాక్టీస్ విజువల్స్ తో వైవిధ్యంగా ‘సూసేకి‘ పాట

లిరికల్ సాంగ్స్ ను తీర్చిదిద్దడంలో డైరెక్టర్ సుకుమార్ తర్వాతే ఎవరైనా అనాల్సిందే. ‘పుష్ప‘ పార్ట్ 1 లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక.. ‘పుష్ప 1‘ కోసం సుకుమార్ డిజైన్ చేసిన లిరికల్ వీడియోస్ ఎంతో ఆకట్టుకున్నాయి. యానిమేషన్ రూపంలోనూ.. మరికొన్ని మేకింగ్ రూపంలోనూ ‘పుష్ప 1‘ లిరికల్ సాంగ్స్ అదరగొట్టాయి. ఇప్పుడు ‘పుష్ప 2‘ కోసం లిరికల్ సాంగ్స్ ను సమ్ థింగ్ స్పెషల్ గా అందిస్తున్నాడు క్రియేటివ్ జీనయస్ సుకుమార్.

ఇప్పటికే ‘పుష్ప 2‘ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప‘ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ‘పుష్ప పుష్ప‘ పాటలో బన్నీ హుక్ స్టెప్స్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘సూసేకి‘ని విడుదల చేసింది టీమ్. ‘వీడు మొరటోడు అని వాళ్లు వీళ్లు ఎన్నెన్ని అన్న పసిపిల్ల వాడు నా వాడు.. వీడు మొండోడు అని ఊరివాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు‘ అంటూ చంద్రబోస్ రాసిన ఈ పాటను శ్రేయ ఘోషల్ అత్యద్భుతంగా ఆలపించింది. ఇక.. ఈ పాటను అల్లు అర్జున్, రష్మిక చేసిన ప్రాక్టీస్ సెషన్ విజువల్స్ తోనే వైవిధ్యంగా రిలీజ్ చేశాడు సుకుమార్. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీతో ‘సూసేకి‘ పాట కూడా ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా పండుతుందనే వైబ్స్ వస్తున్నాయి.

Related Posts