జూన్ 29న కళావేదిక ఎన్.టి.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన కళాకారులకు ‘కళావేదిక ఎన్. టి. ఆర్. ఫిల్మ్ అవార్డ్స్’ను ప్రధానోత్సవం చేయబోతున్నారు. జూన్ 29న హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ వేడుకకు అతిరధమహారథులు హాజరుకానున్నారట.

ఈ అవార్డుల వేడుకను ‘కళావేదిక’ తరపున R.V.రమణ మూర్తి, రఘవి మీడియా మరియు కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ అవార్డుల పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు లాంఛ్ చేసారు.

Related Posts