రాజధాని ఫైల్స్ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు

రాజధాని ఫైల్స్‌.. ఈ మధ్య కాలంలో పొలిటికల్‌ హీట్‌తో రాబోతున్న మూవీ. వినోద్‌కుమార్‌, వాణివిశ్వనాధ్ మెయిన్‌ లీడ్‌ చేసిన ఈ మూవీ అమరావతి రైతుల కన్నీళ్లను, బాధలను ఎలివేట్ చేసే విధంగా తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


రైతులు స్వచ్చందంగా ఇన్ని వేల ఎకరాల భూములు ఇస్తే దానిని హేళన చేస్తూ, వాళ్ళని క్షోభగురి చేసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానిని స్ఫూర్తిగా తీసుకొని రైతుల పక్షాన ఒక సినిమా తీయాలని అనుకున్నాం. ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మాకు కనిపించిందల్లా రైతుల కళ్ళలో కన్నీళ్లు. ఆ కన్నీళ్లకు సమాధానంగా, కన్నీళ్లు తుడిచే విధంగా సమాజాన్ని చైతన్య పరుస్తూ ఒక సామాజిక బాధ్యత గా ఈ సినిమా చేశామన్నారు నిర్మాత రవిశంకర్


నా ద్రుష్టిలో ప్రపంచంలో గొప్ప వృత్తి వ్యవసాయం. ‘రాజధాని ఫైల్స్’ లో భాగం కావడం గొప్ప ఆనందంగా వుంది. దర్శక నిర్మాతలకు సినిమా చిత్ర బృందానికి ధన్యవాదాలు. తప్పకుండా సినిమా చూసి ఆదరించండి’ అని కోరారు వాణీ విశ్వనాధ్‌.


రైతులకు జరిగిన అన్యాయాన్ని చూపించే ఈ కథలో నటించడానికి ముందుకు వచ్చిన వినోద్ కుమార్ సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే వాణీ విశ్వనాథ్ గారు కొద ఎంతగానో ప్రోత్సహించారు. దాదాపు ఏడు వందల రైతుల మధ్య ఈ సినిమా తీశాం. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలు ఈ చిత్రంలో నటించారు. ట్రైలర్ ఇంత సహజంగా కనిపించడానికి కారణం.. నిజంగా బాధని అనుభవించిన రైతులు, వారిలో అవేదన వుంది. అదే తెరపై అద్భుతంగా కనిపించింది. . అఖిలన్ చాలా అద్భుతంగా నటించారు. అమృత ఎరువాక పాటలో చక్కని అభినయం కనబరిచింది. అలాగే హీరోయిన్ వీణ పాత్ర కూడా చాలా బావుంటుందన్నారు దర్శకుడు భాను.
ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

Related Posts