‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా’ ట్రైలర్ లాంచ్ చేసిన నిఖిల్‌

మస్త్ షేడ్స్‌ ఉన్నయ్‌ రా నీలో.. కమలాసన్‌ అంటూ ఈ నగరానికేమైంది మూవీలో అభినవ్‌ గోమఠం చెప్పిన డైలాగ్‌ ఫేమస్ అయ్యింది. మీమ్స్‌లోనూ ఈ డైలాగ్‌ను వాడుతుంటారు. అంతలా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో అభినవ్ గోమఠం మెయిన్‌లీడ్‌తో సినిమా రాబోతుంది. తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్‌ బ్యానర్‌పై భవాని కాసుల, అరెమ్‌ రెడ్డి, ప్రశాంతి వి. లు నిర్మిస్తున్నారు. అభినవ్ గోమఠం సరసన వైశాలి రాజ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 23న వరల్డ్ వైడ్‌ గా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంఘా చిత్ర ట్రైలర్‌ ను హీరో నిఖిల్‌ రిలీజ్‌ చేసారు.


అందరూ ఈ నగరానికేమైంది సినిమాలో అభినవ్‌ లాంటి ఫ్రెండ్‌ కావాలనుకుంటారు. సెట్‌లో నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి అభినవ్‌ అన్నారు హీరో నిఖిల్‌. అభినవ్‌లో చాలా షేడ్స్‌ ఉన్నాయ్‌.. ఈ సినిమాచూసినవాళ్లు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. హీరోగా మారిన అభినవ్ సూపర్‌సక్సెస్‌ కావాలని కోరుకున్నారు నిఖిల్ సిద్దార్ధ్‌.


మామూలు ఫంక్షన్‌లయితే పెద్దగా స్ట్రెస్‌ ఉండదు.. కానీ ఇది నేను హీరోగా చేస్తున్న వేడక కావడంతో స్ట్రెస్‌ ఫీలవుతున్నానన్నారు అభినవ్‌. తన లైఫ్ లో ఈ ఫంక్షన్‌ చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. హీరోగా మారమని ఎంతో మంది ఆఫర్లిచ్చారని.. కానీ తన బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కథ కావడంతో ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నానని తెలిపారు అభినవ్‌. ఈ నగరానికేమైంది సినిమా చూసి తన పాన్ ఇండియా మూవీ స్పై లో ఛాన్స్ ఇచ్చిన ఫ్రెండ్‌ నిఖిల్‌ ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడం ఆనందంగా ఉందన్నారు.
కంటెంట్ బాగుంటే చిన్న సినిమాని అయినా పెద్ద విజయం చేస్తారు తెలుగు ప్రేక్షకులు.. నిఖిల్‌ సూర్య వర్సెస్ సూర్య కు సెట్ అసిస్టెంట్‌గా వర్క్‌చేసిన నేను ఈ సినిమాతో దర్శకుడిగా ముందుకొస్తున్నాను అందుక్కారణం నిర్మాత భవాని కాసుల .. వారికి స్పెషల్ థ్యాంక్స్‌ అన్నారు దర్శకుడు తిరుపతిరావు ఇండ్ల.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయిన హీరో నిఖిల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత భవాని కాసుల. యాడ్ ఏజెన్సీ నిర్వహించిన అనుభవంతో ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టామన్నారు. అందుకు రామ్‌ మోహనరెడ్డిగారు సహకరించారన్నారు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అన్నారు.
అలీ రెజా మరో కీలక పాత్రలో నటిస్తున్న ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా ‘ మూవీని ఫిబ్రవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌ చేస్తున్నారు.

Related Posts