‘భారతీయుడు‘ ఈజ్ బ్యాక్

‘భారతీయుడు‘ ఈజ్ బ్యాక్ అంటూ మరోసారి లంచగొండి తనంపై కదం తొక్కడానికి వచ్చేస్తున్నాడు కమల్ హాసన్. 1996లో సూపర్ హిట్టైన ‘భారతీయుడు‘ సినిమాకి సీక్వెల్ గా వస్తోన్న సినిమాయే ‘భారతీయుడు 2‘. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘భారతీయుడు 2‘ ఇంట్రోని దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు.

ఈ ఇంట్రో విషయానికొస్తే.. ఫస్ట్ పార్ట్ చివరిలో ‘ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడుకి చావే లేదు.. ‘ అంటూ సేనాపతి చెప్పిన డైలాగ్స్ తో ప్రారంభమైంది. కట్ చేస్తే.. 1996 నుంచి 2023 కి స్టోరీ మారుతోంది. మళ్లీ అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోతుంది. కాంట్రాక్ట్స్ కోసం.. సంతకాల కోసం లంచాలు.. లంచగొండి తనం పెరిగిపోతుంది. దీంతో ‘కమ్ బ్యాక్ ఇండియన్‘ అంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్స్ మొదలవుతాయి. అప్పుడు మళ్లీ ఓల్డర్, వైజర్, డెడ్లియర్ లా 90 ఏళ్లకు పై బడిన వయసుతో ‘భారతీయుడు ఈజ్ బ్యాక్‘ అనే డైలాగ్ తో ఎంటరవుతాడు సేనాపతి.

మధ్యలో సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, బ్రహ్మానందం, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీసింహా వంటి పాత్రలను ఈ ఇంట్రోలో చూపించారు. ఇంకా.. దివంగత నటులు నెడుముడి వేణు, వివేక్, మనోబాల కూడా ఈ గ్లింప్స్ లో కనిపించారు. మొత్తంమీద.. ఈనాటి కరప్షన్ ను అరికట్టడానికి భారతీయుడు మళ్లీ వస్తున్నాడు అన్న సందేశాన్ని ఈ ఇంట్రోలో చూపించాడు శంకర్. ఇక.. తన గత చిత్రాల తరహాలోనే ‘భారతీయుడు 2‘ని కూడా ఎంతో భారీదనంతో తెరకెక్కించినట్టు ఇంట్రోని చూస్తే అర్థమవుతోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి అదనపు ఆకర్షణలు కాబోతున్నాయని అర్థమవుతోంది. మొత్తంమీద.. ‘భారతీయుడు 2‘ ఇంట్రో అయితే అదిరిపోయింది. కానీ.. విడుదల తేదీ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.

Related Posts