విక్రమ్ నట విశ్వరూపంతో ‘తంగలాన్‘

విలక్షణ నటుడు విక్రమ్ నట విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించబోతున్న చిత్రం ‘తంగలాన్‘. విక్రమ్ నెవర్ బిఫోర్ మేకోవర్ తో కనిపించబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుంచే అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఆ తర్వాత ఆమధ్య గ్లింప్స్ రావడం.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో పీరయడ్ కి తీసుకెళ్లబోతుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.

బ్రిటిషర్స్ పాలిస్తున్న సమయంలో జరిగిన కొన్ని ఊహాజనితమైన కథాంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ‘యాస్ మిత్ లీడ్స్ టు హిస్టరీ‘ అంటూ ఈ సినిమా ఒక ఊహే అన్నట్టు టీజర్ లోనే ప్రకటించాడు డైరెక్టర్ పా.రంజిత్. అలాగే.. ఈ సినిమా టీజర్ ను చూస్తుంటే 2006లో వచ్చిన మెల్ గిబ్సన్ డైరెక్టోరియల్ హాలీవుడ్ మూవీ ‘అపాకలిప్టో‘ గుర్తుకు రాక మానదు. తమ ప్రాంతం కోసం ఓ తెగ మయాన్ కింగ్ డమ్ తో ఎలా పోరాడింది అనే కథాంశంతో ‘అపాకలిప్టో‘ రూపొందింది. అదే తరహాలో ఈ సినిమాలోని తన తెగ కోసం విక్రమ్ ఎలా పోరాడడన్నదే ‘తంగలాన్‘లో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది.

విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. మిగతా చాలామంది కొత్త నటీనటులు కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts