పూజ కెరీర్ మళ్లీ పుంజుకుంటోందా?

కన్నడ కస్తూరి పూజా హెగ్డే. కన్నడ సంతతికి చెందిన ఈ తులు బ్యూటీ.. పుట్టి, పెరిగిందంతా ముంబైలోనే. కాలేజ్ చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ షో స్ లో పాల్గొన్న పూజా.. 2009 మిస్ ఇండియా కాంపిటేషన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. సినిమాల విషయానికొస్తే.. తొలుత తెలుగులో ‘ముకుంద, ఒక లైలా కోసం’ అంటూ చిన్న చిత్రాలతో అలరించే ప్రయత్నం చేసిన పూజాకి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఒకానొక దశలో ఐరెన్ లెగ్ అనే ఇమేజ్ కూడా వచ్చింది.

ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్, అరవింద సమేత, మహర్షి, అల.. వైకుంఠపురములో‘ అంటూ వరుసగా అగ్ర కథానాయకులతో నటించి టాలీవుడ్ లో పాగా వేసేసింది బుట్ట బొమ్మ. అఖిల్ తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్‘లో కూడా పెర్ఫార్మెన్స్ పరంగా పూజాకి మార్కులు పడ్డాయి. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే ‘రంగస్థలం, గద్దలగొండ గణేష్, ఎఫ్3‘ వంటి సినిమాలలో స్పెషల్ అప్పీరెన్సెస్ తో అలరించింది. ప్రస్తుతం పూజా కెరీర్ డల్ గా సాగుతోంది. పోయినేడాది ఎన్నో అంచనాలతో విడుదలై�