చంద్రముఖి2 సాంగ్.. వారాయ్ ని మరిపించేలా ఉందే

చంద్రముఖి.. 2005లో వచ్చిన సినిమా. రజినీకాత్ ఛరిష్మా.. జ్యోతిక నటనతో ఆ రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిందీ చిత్రం. పి వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1993లో మళయాలంలో మోహన్ లాల్, సురేష్‌ గోపీ, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మణిచిత్రతాళుకు రీమేక్. రీమేక్ అయినా ఒరిజినల్ ను మించిన విజయం సాధించింది. అదే సినిమా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఓ రకంగా హారర్ కామెడీకి ఇదే పునాదిలాంటిది అని చెప్పొచ్చు. ఈ సినిమాకు సీక్వెల్ గా నాగవల్లి అనే సినిమా తీశాడు వాసు. కానీ అది డిజాస్టర్ అయింది. అంచనాలు ఎక్కువగా ఉండటంతో పాటు కథ, కథనాల్లో లోపం వల్లే నాగవల్లి పోయింది. బట్ ఇదే సినిమా కన్నడలో సూపర్ హిట్ కావడం విశేషం. ఇక ఇన్నాళ్ల తర్వాత చంద్రముఖి 2 అంటూ మరో సీక్వెల్ తో వస్తున్నాడు.

ఆ పేరు మారిస్తే ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంటే ఇందుకు కారణం అంటున్నారు. పి వాసు ఫామ్ లో లేడు. అయినా రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్నారు అన్నప్పుడే అంతా ఆసక్తిగా చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ప్రతి అప్డేట్ వస్తోంది. తెలుగులో ఈ చిత్రానికి కీరవాణి సంగీతం చేశాడు. తాజాగా చంద్రముఖి 2 నుంచి కంగనా రనౌత్ పాట విడుదలైంది.


చంద్రముఖి లో క్లైమాక్స్ లో వారాయ్ నా నుడి తేనీ.. అంటూ సాగే పాట తమిళ్ లో ఉన్నా మనవాళ్లు పూర్తిగా పాడుకునేంతగా పాపులర్ అయింది. నిజానికి చంద్రముఖి సినిమాకు అప్పట్లో విద్యా సాగర్ సంగీతం మెయిన్ హీరో అని కూడా అన్నారు. అలాంటి మ్యాజిక్ ను రెట్టింపు చేసేలా ఉంది ఈ సారి కీరవాణి పాట. వినగానే చంద్రముఖిలోని ఈ పాటను గుర్తుకు తెస్తోంది. అంటే ట్యూన్ పరంగా కాదు. సినిమా పరంగా మరోసారి ఏదో సంచలనం సృష్టించబోతున్నాడు దర్శకుడు అనిపిస్తుంది. ఇక ఈ సారి కీరవాణి కూడా నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడని ఈ పాట చూడగానే అర్థం అవుతుంది. ఆల్రెడీ నేపథ్య సంగీతం అయిన తర్వాత ఆయనే చంద్రముఖి2 మిమ్మల్ని భయంతో వణికిస్తుంది అని అంచనాలు పెంచాడు. అది నిజమే ఈ పాట చెబుతోంది.


పదము పదముగా హృదయ లయలుగా.. ప్రకృతి పురుషులే పరవశించగా అంటూ సాగే ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్ రాశాడు. శ్రీనిధి తిరుమల గాత్రంలో చాలా హాయిగా వినిపిస్తుంది.ఇక కీరవాణి ఆర్కెస్ట్రైజేషన్ అద్భుతం అనేలా కనిపిస్తోంది. ఇంత ఆర్కెస్ట్రాలో కూడా సాహిత్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రతి అక్షరం అర్థమయ్యేలా ఉంది. “ఎన్ని కలలు ఎన్ని అలలు కన్నె మనసు పొరలలో.. వలసులెగసి తలపులెగసి నాలో.. సాంద్ర కళల ఇంద్ర ధనుషు వెల్లివిరిసె వయసులో .. మరుల విరుల సరులు మెరిసె లోలో.. ” అని సాగే చరణంలో చైతన్య ప్రసాద్ కలం కదం తొక్కింది. ఈ పదాలన్నీ ఆ నాయిక మనోగతాన్ని కథాపరంగా తెలిపేలా ఉన్నాయి. ఇక ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందనిపిస్తోంది. మొత్తంగా ఈ ఒక్క పాటతో కీరవాణి చంద్రముఖి 2పై భారీగా అంచనాలు పెంచాడు.

Related Posts