కింగ్ ఆఫ్‌ కోతా సాంగ్ అసురుడ రావణా

భాషా భేదాలు లేకుండా దూసుకుపోతోన్న హీరో దుల్కర్ సాల్మన్. అన్ని భాషల్లోనూ హీరోగా నటిస్తున్నాడు. అలాగని సొంత పరిశ్రమ మళయాలాన్ని మాత్రం ఎట్టిపరిస్థితిలో నిర్లక్ష్యం చేయడు. బయట మంచి కథ అంటే వెంటనే వచ్చేస్తాడు. ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా అనౌన్స్ అయింది.

ఇక తన బర్త్ డే సందర్భంగా అతని లేటెస్ట్ మళయాల మూవీ కింగ్ ఆఫ్‌ కోతా నుంచి ఓ సాంగ్ విడుదల చేశారు. కోత అనేవాడి జీవితం ఏంటీ.. అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది.. అతనితో పెట్టుకుంటే ఏమౌతారు అనే కోణంలో సాగే పాట ఇది. “అసురుడ రావణా.. మత్తులోన రాక్షసులం రా.. పట్టుదల ధైర్యమే.. కొట్టలేని శౌర్యం.. మట్టుపెట్టలేనిది వీరమ్.. కేస్ అంటేనే మామూలే ఎన్నెన్నో చూశాం రా.. ఏ తూటా అక్కర్లే దమ్మున్న గుండెరా ” అంటూ సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాశాడు. ఎల్వీ రేవంత్, సిందుజ శ్రీనివాసన్ ఆలపించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.


ఇలాంటి పాటలను తెలుగులో రాస్తున్నప్పుడు పదాలు గందరగోళంగా ఉంటాయి. ఒరిజినల్ లోని ఫ్లేవర్ కోసమంటూ తెలుగులో అంతగా వాడకంలో లేని పదాలతో నింపేస్తారు. బట్ ఈ పాట అలా లేదు. ఇదీ ఒరిజినల్ సాంగ్ లానే ఉంది. తెలుగులోనే సినిమా వస్తే ఎలా ఉంటుందో సాహిత్యం అంత చక్కగా కుదిరింది.

గానం కూడా అలాగే ఉంది. అందుకు ప్రధాన కారణం జేక్స్ బిజోయ్ ట్యూన్ అనుకోవచ్చు. ఏ భాషలో అయినా సెట్ అయ్యే ట్యూన్ ఇది. ఇక ఈ పాటలో గురు ఫేమ్ రితికా సింగ్ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వడం విశేషం. అంటే అమ్మడు మళయాలంలో ఐటమ్ సాంగ్ చేసిందన్నమాట. మొత్తంగా ఈ మధ్య కాలంలో వచ్చిన డబ్బింగ్ సాంగ్స్ లో చాలా బెటర్ గా ఉందీ పాట.

Related Posts