మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన థమ్స్ అప్

సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ అండ్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ముఖ్యంగా క్లాస్ ఆడియన్సెస్ లో మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే స్టార్డమ్ అనేది సైకిల్ చక్రం లాంటిది కదా.. ఒకసారి టాప్ లో ఉంటుంది. మరోసారి బాటమ్ కు వస్తుంది. ప్రస్తుతం ఒక్క విషయంలో మహేష్ క్రేజ్ బాటమ్ కు దిగింది. అదే థమ్స్ అప్ యాడ్. తెలుగులో విపరీతమైన యాడ్స్ చేసే ఏకైక స్టార్ గా మహేష్ కు పేరుంది. చాలాయేళ్లుగా అతను థమ్స్ అప్ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. బట్.. లేటెస్ట్ గా మహేష్ కు షాక్ ఇస్తూ థమ్స్ అప్ కంపెనీ..అతని ప్లేస్ లో విజయ్ దేవరకొండను తీసుకుంది. ఇది ఓ రకంగా సూపర్ స్టార్ కు షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి.
ఏ కార్పోరేట్ కంపెనీ అయినా తమ ప్రాడక్ట్ ప్రమోషన్ కోసం క్రేజ్ వెంటే పరుగులు తీస్తుంది. ఎలా చూసినా.. ఎవరేమనుకున్నా.. యూత్ లో ఇప్పుడు మహేష్ కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండకే ఎక్కువ క్రేజ్ ఉంది. పైగా మనోడు చాలా తక్కువ టైమ్ లోనే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ సినిమా చేయడానికి ముందే రావడమే ఇక్కడ అతి పెద్ద విశేషం. ఎవరైనా తమ సినిమాల ద్వారా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఇమేజ్ సంపాదించుకుంటారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కేవలం తన యాటిట్యూడ్ తోనే ప్యాన్ ఇండియన్ ఆడియన్సెస్ ను అట్రాక్ట్ చేశాడు. ఇది ఇంతకు ముందు ఏ స్టార్ కూ సాధ్యం కాలేదు.
సో.. ఇన్నేళ్లుగా మహేష్ క్రేజ్ ను వాడుకున్న థమ్స్ అప్ కంపెనీ ఇప్పుడు అతనికంటే విజయ్ కే ఎక్కువ క్రేజ్ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది అనుకోవచ్చు. నిన్నగాక మొన్నొచ్చిన స్టార్ ముందు తన క్రేజ్ నిలబడలేదు కాబట్టి.. ఓ రకంగా ఇది మన పోకిరికి అవమానంగానూ చెప్పొచ్చు. మొత్తంగా విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడనే చెప్పాలి.

Team Mahesh Babu on Twitter: "Superstar @urstrulyMahesh is the New Brand Ambassador For @MountainDewIn ⚡ #DarrKeAageJeetHai #MountainDew #MaheshBabu https://t.co/u8QNcX1pu5" / Twitter

Related Posts