మాస్ మహరాజ్ కు క్రాక్ సినిమా ఇచ్చిన బూస్టప్ మామూలుగా లేదు. వరుసగా కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. మామూలుగా రవితేజ సినిమాల్లో కొన్నాళ్లుగా కథలు కనిపించడం లేదు. కాకపోతే క్రాక్ లో కాస్త రియాలిటీ కూడా ఉండటంతో పాటు అటు తనలాగే ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని రాసుకున్న కథనం క్రాక్ ను బ్లాక్ బస్టర్ చేసింది. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా చేసిన సముద్రఖని తర్వాత ఎక్కువగా ఆకట్టుకున్నది మరో లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్. తను కటారి కృష్ణ లవర్ గా జయమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. తన ఆహార్యంతో పాటు చెప్పుకున్న డబ్బింగ్ కూడా విలనీకి తోడయ్యాయి. రవితేజ, జయమ్మ మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. మరి ఆ సెంటిమెంట్ కోసమా లేక నిజంగానే అవసరం ఉందా తెలియదు కానీ.. రవితేజ లేటెస్ట్ మూవీలో కూడా ఓ లేడీ విలన్ ను తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. పైగా ఈ విలన్ చాలా హాట్ కూడా. కొన్నాళ్ల క్రితం వచ్చిన హుషారు చిత్రంలో హీరోయిన్ గా నటించిన బ్యూటీఫుల్ గాళ్ దక్షా నగార్కర్ గుర్తుందా..? రీసెంట్ గా జాంబిరెడ్డి సినిమాలోనూ హాట్ హాట్ గా ఆకట్టుకుంది. తనే రవితేజ కొత్త సినిమాలో విలన్ గా నటించబోతోందనే రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ లైనప్ లో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి చిత్రాలున్నాయి. వీటిలో రావణాసుర చిత్రంలోనే ఈ దక్షాను విలన్ పాత్రలో తీసుకున్నారంటున్నారు. రావణాసుర చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా కొత్తగా ఆకట్టుకునేలా కనిపించింది. సినిమాలో మెయిన్ విలన్ వేరే ఉన్నా.. ఓ లేడీ విలన్ కు ఆస్కారం ఉందట. ఆ పాత్రలో దక్షా నగార్కర్ ను ఎంపిక చేశారంటున్నారు. రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతోన్న ఈ చిత్రం మన పురాణాల్లోని ఓ గాథను ఆధారంగా తీసుకుని రాసుకున్న కథ అంటున్నారు. మొత్తంగా బ్యూటీఫుల్ లేడీస్ విలన్ గా ఉంటే రవితేజ కు సెంటిమెంట్ గా మారుతుందా లేదా అనేది రావణాసుర రిజల్ట్ ను బట్టి సెట్ అవుతుందేమో. ఒకవేళ ఈ చిత్రం హిట్ అయితే ఇకపై రవితేజ సినిమాల్లో ఖచ్చితంగా ఓ బ్యూటీఫుల్ లేడీ విలన్ ను సెట్ చేసుకునేలా ఉన్నారు.
|