ఎన్టీఆర్ కు సొంత ఫ్యామిలీ కంటే వైసీపీ ఫ్రెండ్సే ఎక్కువా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నటుడుగా అతని టాలెంట్ ఏంటో ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతా తెలిసింది. ఇండియాలోని హీరోల్లోబెస్ట్ డ్యాన్సర్స్ లోనూ ఒకడుగా చెప్పుకుంటారు. మాస్ హీరోగా అతనికి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. నందమూరి తారకరామారావు రూపాన్నే కాదు.. పోరాట తత్వాన్ని కూడా పుణికిపుచ్చుకున్నాడు అంటారు. అందుకే కొన్నాళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఆ క్రమంలో ప్రమాదానికీ గురయ్యాడు. కాకపోతే అప్పుడు టిడిపి గెలవలేదు. దీంతో పాలిటిక్స్ కు కొంత గ్యాప్ ప్రకటించాడు.

అయినా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ఎన్టీఆర్ పేరు ఆ పార్టీతో ముడిపెట్టి నిరంతరం వినిపిస్తూనే ఉంది. ఈ విషయంలో అభిమానులు ఎంత కవర్ చేసుకున్నా.. వర్కవుట్ కావడం లేదు. ముఖ్యంగా వైసీపీలోని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ ఎన్టీఆర్ కు క్లోజ్ ఫ్రెండ్. వీరి కోసమే రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాలకు హాజరుకాలేదు అనేది తాజాగా వినిపిస్తోన్న వార్త.ఎన్టీఆర్ శతజయంతి ముగింపు సభలను బాలకృష్ణ చేతుల మీదుగా నిర్వహించారు. చంద్రబాబు బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా నిలిచాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

అయితే ఆ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని చాలామంది కోరుకున్నారు. బట్ అతను రాలేదు. దీంతో అసలు తారక్ కు ఆహ్వానం లేదు. అందుకే వెళ్లలేదు అంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. కానీ ఇందులో నిజం లేదు. జూనియర్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కు కూడా ఆహ్వానం �