ఎన్టీఆర్ కు సొంత ఫ్యామిలీ కంటే వైసీపీ ఫ్రెండ్సే ఎక్కువా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నటుడుగా అతని టాలెంట్ ఏంటో ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతా తెలిసింది. ఇండియాలోని హీరోల్లోబెస్ట్ డ్యాన్సర్స్ లోనూ ఒకడుగా చెప్పుకుంటారు. మాస్ హీరోగా అతనికి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. నందమూరి తారకరామారావు రూపాన్నే కాదు.. పోరాట తత్వాన్ని కూడా పుణికిపుచ్చుకున్నాడు అంటారు. అందుకే కొన్నాళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఆ క్రమంలో ప్రమాదానికీ గురయ్యాడు. కాకపోతే అప్పుడు టిడిపి గెలవలేదు. దీంతో పాలిటిక్స్ కు కొంత గ్యాప్ ప్రకటించాడు.

అయినా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ఎన్టీఆర్ పేరు ఆ పార్టీతో ముడిపెట్టి నిరంతరం వినిపిస్తూనే ఉంది. ఈ విషయంలో అభిమానులు ఎంత కవర్ చేసుకున్నా.. వర్కవుట్ కావడం లేదు. ముఖ్యంగా వైసీపీలోని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ ఎన్టీఆర్ కు క్లోజ్ ఫ్రెండ్. వీరి కోసమే రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాలకు హాజరుకాలేదు అనేది తాజాగా వినిపిస్తోన్న వార్త.ఎన్టీఆర్ శతజయంతి ముగింపు సభలను బాలకృష్ణ చేతుల మీదుగా నిర్వహించారు. చంద్రబాబు బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా నిలిచాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

అయితే ఆ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని చాలామంది కోరుకున్నారు. బట్ అతను రాలేదు. దీంతో అసలు తారక్ కు ఆహ్వానం లేదు. అందుకే వెళ్లలేదు అంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. కానీ ఇందులో నిజం లేదు. జూనియర్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కు కూడా ఆహ్వానం వెళ్లిందట. అయినా వాళ్లు ఆ వేడుకకు వెళ్లలేదు. అందుకు ప్రధాన కారణం.. తాను అక్కడికి వెళితే అంతకు ముందే గుడివాడ, నిమ్మకూరు అభివృద్ధి విషయంలో కొడాలి నాని, చంద్రబాబు మధ్య జరిగిన వాగ్వాదం మళ్లీ తెరపైకి వస్తుంది. అంతే కాదు.. తను వెళితే తన స్నేహితుడు కొడాలి నానికి ఇబ్బంది అవుతుందని భావించే జూనియర్ ఎన్టీఆర్ ఈ సభకు వెళ్లలేదు అనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది ఏంటంటే.. జూనియర్ ను ఆహ్వానించాలని చంద్రబాబే స్వయంగా బాలకృష్ణకు సూచించాడట. ఆ మేరకు బాలయ్య ఆహ్వానం పంపించాడట. బట్ తను వెళ్లడం వల్ల వైసీపీలో ఉన్న తన స్నేహితులు ఇబ్బంది పడతారు అనే కారణంతోనే తారక్ .. తాతగారి శత జయంతి ముగింపు సభకు వెళ్లలేదు అని చెబుతున్నారు.


నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టింది అనే టాక్ ఉంది. కానీ.. జూనియరే ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అనేది కొన్నాళ్లుగా.. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. బాలయ్య మొదట కోప్పడ్డా.. తర్వాత హరి అన్న తనయులుగా తారక్, కళ్యాణ్ రామ్ అంటే ప్రేమ చూపిస్తాడని కుటుంబ సభ్యులు చెబుతారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం అందుకుపూర్తి భిన్నంగా సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నాడు అనేది కొందరి ఆరోపణ. అందుకే కొన్నాళ్ల క్రితం తమ సొంత అక్క సుహాసిని కూకట్ పల్లి నుంచి పోటీ చేసినప్పుడు కనీస మద్ధతు ప్రకటించలేదు. సపోర్ట్ చేయలేదు.

అలాగే చంద్రబాబు ఇంటి ఆడవారిని వైసీపీ వాళ్లు బూతులు తిట్టినప్పుడు ఎన్టీఆర్ స్పందన ఎంతో నీరసంగా ఉందని అప్పుడే చాలామంది విమర్శించారు. ఏదేమైనా పెద్దాయన శతజయంతి ముగింపు ఉత్సవాలకు ఆహ్వానం లేక వెళ్లలేదు అనుకున్నవారు.. ఇప్పుడు అసలు నిజం తెలిసి.. జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు.. బయట కూడా మంచి నటుడే అంటున్నారు. లేకపోతే సొంత ఫ్యామిలీ వేడుక కంటే అతనికి వైసీపీలోని ఫ్రెండ్స్ బాధపడతారేమో అనే అంశం పెద్దగా కనిపించిందా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనికి జూనియర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related Posts