రాజమౌళి అయినా సుకుమార్ తర్వాతే ..?

ఒక సినిమా మొదలైందంటే.. దాని అవుట్ పుట్ బెస్ట్ గా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అలాగే ఆ సినిమా మేకర్స్ నుంచి కూడా అవుట్ పుట్ ఆశిస్తారు. మళ్లీ ఇదేంటీ అనిపిస్తోంది కదా..? నిజమే.. ఒకక సక్సెస్ ఫుల్ మేకర్ ను గుర్తించాలంటే అతను ఎన్ని హిట్ మూవీస్ తీశాడు అని మాత్రమే కాదు.. తనతో పాటు ఇంకెంతమంది హిట్ మూవీస్ తీయగల దర్శకులను అందించాడు అనేది కూడా చూడాలి. అలా చూస్తే ఆస్కార్ వరకూ వెళ్లిన(ఆస్కార్ రాజమౌళికి, అతని సినిమాకు రాలేదు కాబట్టి) రాజమౌళి..

సుకుమార్ కంటే చాలా చాలా వెనకే ఉండిపోయాడు అనేది నిజం. పైగా ఆ నిజం కళ్లముందు కనిపిస్తోంది కూడా. రాజమౌళి తోపు దర్శకుడే. ప్యాన్ ఇండియన్ డైరెక్టరే. కానీ తన శిష్యులెవరూ కనీసం తెలుగు స్టేట్స్ ను అలరించిన వారు ఒక్కరూ లేరు. ఇంకా చెబితే అతనికి మొదటి నుంచీ సపోర్ట్ గా ఉన్న త్రికోటి అనే కో డైరెక్టర్ దర్శకుడైతే.. అస్సలు ఆ మార్కే కనిపించలేదు.

పోనీ ఇతను కొత్త మార్క్ కోసం ప్రయత్నించాడు అనుకున్నా.. అది కూడా కనిపించలేదు. బట్ సుకుమార్ శిష్యులు అలా కాదు. కొన్నాళ్ల క్రితం వచ్చి కుమార్ 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ ఓ రకంగా అప్పుడే సాహసం చేశాడు. హీరోయిన్ తో అలాంటి పాత్ర చేయించడం.. హీరో తప్పును ఒప్పుకుని హీరోయిన్ కోసం నిలబడటం అనేది అప్పుడు చాలా కొత్త పాయింట్. పైగా సినిమా కూడా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయింది.
సుకుమార్ మరో శిష్యుడు బుచ్చిబాబు కూడా అంతే.

ఉప్పెన సినిమాతో పెద్ద సాహసం చేశాడు. పైగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మాత్రమే చూస్తారు అనే పాయింట్ ను దాటి తన ఉప్పెన సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. హీరోగా వైష్ణవ్ కు తిరుగు