సామజవరగమనా ..

హీరోగా శ్రీ విష్ణు ఇమేజ్ గురించి అందరికీ తెలుసు. వైవిధ్యమైన కథలు సెలెక్ట్ చేసుకుంటాడు. అతని కథల ఎంపికలోఅందరినీ అలరించే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ తరహా హీరోలుఇండస్ట్రీలో ఇంకా ఉన్నారు. వీరంతా ఒక ఇమేజ్ రాగానే మాస్ స్టోరీస్ అంటూ వెళతారు. అవి వారి ఇమేజ్ కు స్టేచర్ కు సెట్ కావు. కట్ చేస్తే ఫ్లాపులు తప్పవు. అలా వరుస ఫ్లాపులు ఇచ్చి కనుమరుగైన హీరోలు చాలామందే ఉన్నారు.

బట్ శ్రీ విష్ణు మరీ అలా కాదు కానీ.. అప్పుడప్పుడూ మాస్ రూట్ లోకి వెళ్లి చేతులు కాల్చుకోవడం.. తర్వాత మళ్లీ తన కంఫర్ట్ జోన్ అయిన ఎంటర్టైన్మెంట్ లోకి రావడం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సామజవరగమనా అనే మూవీతో వచ్చాడు. ఈ సినిమాకు రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ప్రీమియర్స్ వల్ల అతని సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అయింది. సినిమా హిలేరియస్ గా ఉండటంతో ప్రీమియర్స్ చూసిన వాళ్లు రిలీజ్ కు ముందే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.


నిజంగానే సినిమా చాలా బావుంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోనూ బాగా చదువుకోని కొడుకులను తండ్రులు తిట్టడం చూశాం. బట్ ఈ మూవీలో రివర్స్ లో వెళ్లాడు దర్శకుడు. తన తండ్రి డిగ్రీ పాస్ అయితేనే తాతల ఆస్తి వస్తుంది. అందుకోసం తండ్రిని డిగ్రీ పాస్ చేయించే బాధ్యత తీసుకుని అతను చదవకపోయినా.. పాస్ కాకపోయినా అదే పనిగా తిడుతూ ఉంటే ఆడియన్స్ కు అద్బుతమైన వినోదం అందింది.

ఇదే క్రమంలో హీరోకూ ఓ ఇష్యూ పెట్టాడు. తనకు ఫస్ట్ లవర్ రాఖీ కట్టిందని.. ఎవరినీ ప్రేమించకుండా.. తనను ఎవరైనా ప్రేమిస్తే వారితో రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. ఇక తన తండ్రిని పాస్ చేయించడం కోసం ఓ అమ్మాయిని ట్యూటర్ గా తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. చివరికి ఆమె�