‘ఫైటర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ క్రేజీ మూవీ ‘ఫైటర్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హృతిక్, దీపిక ఫస్ట్ టైమ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ ఇది. ఇప్పటికే హృతిక్ కి ‘బ్యాంగ్ బ్యాంగ, వార్’ వంటి సినిమాలతో పాటు.. దీపిక కు ‘పఠాన్’ వంటి అద్భుతమైన విజయాన్నందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆద్యంతం ఏరియల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ‘ఫైటర్’కి అంతటా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి ఏకంగా నాలుగున్న స్టార్స్ రేటింగ్ ఇచ్చాడు బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్. ఒన్ వర్డ్ లో ఈ మూవీ బ్రిలియంట్ అంటూ చెప్పాడు.

‘వార్, పఠాన్’ తర్వాత ‘ఫైటర్’తో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ హ్యాట్రిక్ కొట్టాడని.. ఈ సినిమాలో ఏరియల్ కంబాట్, డ్రామా, ఎమోషన్స్, పేట్రియాటిజమ్ బాగా వర్కవుట్ అయ్యానని తన రివ్యూలో తెలిపాడు. హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్, అతని స్టెల్లర్ యాక్ట్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయని.. దీపిక పదుకొనె అటు యాక్షన్, ఇటు గ్లామర్ రెండింటిలో అదరగొట్టిందన్నాడు తరణ్. ఇంకా.. అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఓబెరాయ్, రిషబ్ షానీ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారన్నాడు.ఓవరాల్ గా.. ఈ చిత్రమొక కింగ్ సైజ్ ఎంటర్ టైనర్ అంటూ ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తాడు.

Related Posts