అఖండ – యు.ఎస్. రివ్యూ

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్ఆక్ బ‌స్ట‌ర్స్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాలో బాల‌య్య అఘోరా పాత్ర పోషించ‌డం విశేషం. క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డుతూ వ‌చ్చిన అఖండ చిత్రం ఎట్ట‌కేల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యు.ఎస్ లో ఆల్రెడీ అఖండ ఫ‌స్ట్ షో ప‌డ‌డం జ‌రిగింది. మ‌రి.. అఖండ యు.ఎస్ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాల‌య్య ఓ ఊరికి పెద్ద దిక్కులా ఉంటారట‌. అన్యాయం ఎక్క‌డ జ‌రిగినా అడ్డుకుంటార‌ట‌. స‌ర‌దాగా, ఎమోష‌న‌ల్ గా సాగిన ఫ‌స్టాప్ లో ఇంట‌ర్వెల్ కి ముందు ఊహించ‌ని ట్విస్ట్ వ‌స్తుంద‌ట‌. ఆడియ‌న్స్ షాక్ అయ్యేలా.. ఇంకా చెప్పాలంటే.. సెకండాఫ్ ఏం జ‌ర‌గ‌నుందో అనే ఉత్కంఠ‌తో చూసేలా ఉంటుంద‌ట‌. ఇక‌ సెకండాఫ్ పూర్తిగా డిప‌రెంట్ ప్ర‌జెంటేష‌న్ తో ఉంటుంద‌ట‌. అఖండ‌గా బాల‌య్య డిఫ‌రెంట్ షేడ్ అయితే.. పూన‌కాలు తెప్పించేలా.. థియేట‌ర్లు మోత మ్రోగిపోతాయ‌ని అంటున్నారు. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే.. నెక్ట్స్ లెవెల్ లో ఉంద‌ట‌.

ఇక సాంగ్స్ విష‌యానికి వ‌స్తే.. జై బాల‌య్య సాంగ్, అఖండ టైటిల్ సాంగ్ ఓ రేంజ్ లో ఉన్నాయ‌ట‌. ముఖ్యంగా జై బాల‌య్య సాంగ్ లో అయితే.. బాల‌య్య వేసిన స్టెప్పులు సూప‌ర్ అంటున్నారు. ఈ వ‌య‌సులో ఈ రేంజ్ లో స్టెప్పులు వేయ‌డం మామూలు విష‌యం కాదంటున్నారు. బాల‌య్య‌, విల‌న్ శ్రీకాంత్ మ‌ధ్య వ‌చ్చే క్లైమాక్స్ సీన్ అయితే.. వేరే లెవ‌ల్ లో ఉన్నాయ‌ట‌. బాల‌య్య అభిమానులు అయితే.. ర‌చ్చ ర‌చ్చ చేయ‌డం ఖాయం అంటున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింద‌ని.. రెండు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ లో బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించార‌ని.. నంద‌మూరి అభిమానుల‌కు ఇది పండ‌గ‌లాంటి సినిమా అని అంటున్నారు. ఇది ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అని యు.ఎస్ లో ప్రివ్యూ చూసిన ఆడియ‌న్స్ చెబుతున్న మాట‌. సో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అఖండ అంద‌ర్నీ ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంద‌ని ఆశిద్దాం.

Related Posts