పోస్టర్ తో హీట్ పెంచుతోన్న ‘టిల్లు స్క్వేర్’

మార్చిలో రాబోతున్న క్రేజీ మూవీస్ లో ‘టిల్లు స్క్వేర్’ ఒకటి. సూపర్ హిట్ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా రూపొందుతోన్న సినిమా ఇది. స్టార్ బాయ్ సిద్ధు.. టిల్లుగా డబుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి ఈ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో అంచనాలు పెంచిన ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఈరోజు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు కానుకగా ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ అనౌన్స్ మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

‘డీజే టిల్లు’గా టైటిల్ రోల్ లో సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫామెన్స్ కి ఫిదా అవ్వని వారు ఉండరు. అలాగే.. ‘డీజే టిల్లు’లో రాధికగా నటించిన నేహా శెట్టి రోల్ అంతే హైలైట్ అయ్యింది. గ్లామర్ కి పనిచెబుతూ ఎంతో రొమాంటిక్ గా తీర్చిదిద్దిన రాధిక క్యారెక్టర్ సినీ లవర్స్ లో గుర్తుండిపోతుంది. అందుకే.. ఇప్పుడు సీక్వెల్ లోనూ రాధిక పాత్రకు సంబంధించిన రిఫరెన్సెస్ భారీగానే ఉండబోతున్నాయి. దానికి తోడు మొదటి భాగంలో రాధిక పాత్రకు మించిన రీతిలో సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ పోషించిన లిల్లీ రోల్ ను తీర్చిదిద్దారట.

ఇప్పటివరకూ హోమ్లీ రోల్స్ లో మురిపించిన మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్’ కోసం గ్లామర్ గేట్లు ఎత్తేసినట్టు తెలుస్తోంది. మునుపెన్నడూ కనిపించని రీతిలో ఫుల్ గ్లామరస్ అవతార్ లో అనుపమ ఈ సినిమాలో అలరించబోతున్నట్టు ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. ఈ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో లీడ్ పెయిర్ సిద్ధు, అనుపమ రొమాంటిక్ పోస్టర్ కుర్రకారుకు హీట్ పెంచేలా ఉంది. మొత్తంమీద.. పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ తో ఏ రేంజులో అలరిస్తుందో చూడాలి. మార్చి 29న ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts