ఖుషీ మ్యాజిక్ నిలబెట్టుకుంటుందా..

ఖుషీ.. అన్నీ బావుంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన సినిమా. అనుకోకుండా సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పది నెలలు ఆలస్యంగా ఈ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బుధవారం ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేస్తున్నారు. అందుకే అన్ని భాషల నుంచి వివిధ మీడియా ప్రతినిధులను ఇక్కడికే రప్పించి ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం సమంత కూడా వెకేషన్ నుంచి తిరిగి వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో తన ఫ్రెండ్ చిన్మయి ఇంట్లో ఆమె పిల్లలతో గడుపుతోంది.


ఇక ఖుషీ ఇంత ఆలస్యమైనా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది. సినిమా నుంచి వచ్చిన పాటలు సంచలన విజయం సాధించాయి. ఇప్పటి వరకూ మూడు సాంగ్స్ వచ్చాయి. వాటితో పాటు ఆ పాటల్లో ఉన్న విజయ్, సమంత జోడీ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు ఖుషీపై ముందు నుంచీ తెలియని ఓ పాజిటివ్ నెస్ కనిపిస్తూ వచ్చింది. దాన్ని పాటలు రెట్టింపు చేశాయి. ఓ రకంగా ఈ సినిమా ఆడియన్స్ లోకి మ్యాజికల్ గా వెళుతోందని చెప్పాలి. ఈ మ్యాజిక్ ను ట్రైలర్ కూడా నిలబెట్టుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. యస్.. ఇప్పుడు అందరి దృష్టీ ఖుషీ ట్రైలర్ పైనే ఉంది. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతోంది అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రం కేవలం తెలుగు సినిమాగానే మొదలైంది. అవుట్ పుట్ చూసిన తర్వాతే అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. అంటే కంటెంట్ ఎంత యూనిక్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ఫీలింగ్ వారికి మాత్రమే వస్తే ఉపయోగం ఉండదు. ఆడియన్స్ కూ కలగాలి. అప్పుడే విజయం సాధ్యం అవుతుంది. ఈ ట్రైలర్ తో కంటెంట్ ఏంటీ అనే క్లారిటీ వస్తుంది. మొత్తంగా ఖుషీ ట్రైలర్ తో కూడా మ్యాజిక్ చేయగలిగితే రిజల్ట్ సంగతేమో కానీ.. ఓపెనింగ్స్ మాత్రం భారీగా ఉంటాయనే చెప్పొచ్చు.

Related Posts