బ్రో లో పవన్ ఎంట్రీ ఎప్పుడు

బ్రో.. ఈ నెల 28న విడుదల కాబోతోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ చీఫ్‌ గెస్ట్ గా వస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంఓ సాయితేజ్ కూడా ఉండటంతో మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.

నిజానికి ఈ మూవీకి హీరో సాయితేజ్. పవన్ పాత్ర గెస్ట్ గా ఉంటుంది. కానీ తెలుగులో అలా చేస్తే కుదరదు అని ఆయన పాత్ర లెంగ్త్ ను బాగా పెంచారు. ఆ పాత్ర ఎంత సేపు ఉంటుందీ అంటే.. 50 నిమిషాలకు పైనే అన్నాడు దర్శకుడు సముద్రఖని. అయితే సినిమాలో ఆయన ఎంట్రీ ఇచ్చేది ఇంటర్వెల్ కు ముందు అని తెలుస్తోంది.


ఆయన ఎంట్రీయే ఇంటర్వెల్ బ్యాంగ్ గా చెబుతున్నారు. అంటే సెకండ్ హాఫ్ లో కనిపిస్తాడన్నమాట. సెకండ్ హాఫ్‌ లో కూడా పూర్తిగా ఉండడు అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ వరకూ సాయితేజ్ పాత్రకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్‌ మాయం అయిపోతాడు. అంటే క్లైమాక్స్ లో కూడా ఆయన ఉండడు అన్నమాట. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టైమ్ అనే పాత్ర చేస్తున్నాడు.

అంటే దేవుడు కాలం రూపంలో వచ్చి మనిషిని కలుస్తాడు. ఆ మనిషి నిజంగా కాలాన్ని ఎలా వాడుతున్నాడు. ఏ విషయానికి ఎంత టైమ్ కేటాయిస్తున్నాడు. అతను టైమ్ కేటాయిస్తున్న అంశాలు నిజంగా జీవితంలో ప్రధానమైనవేనా కాదా అనే కోణాలను పవన్ పాత్రతో చూపించబోతున్నాడు దర్శకుడు.

అలాగని ఇదేమీ క్లాస్ లు పీకినట్టు కాకుండా.. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందట. అది కూడా పవర్ స్టార్ ఎనర్జీని డబుల్ చేసి చూపిస్తాడట సముద్రఖని. అందుకే ఈ మూవీపై అంత ఆసక్తి. మొత్తంగా పవన్ కళ్యాణ్‌ ఫస్ట్ హాఫ్ లో ఉండడు. క్లైమాక్స్ ముందే ఆ పాత్ర అయిపోతుందన్నమాట.