గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గా ‘విశ్వం‘ పోస్టర్

మ్యాచో స్టార్ గోపీచంద్, సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వం‘. ఒకప్పుడు భారీ విజయాలందించిన ఈ ఇద్దరూ.. ఇప్పుడో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. పైగా.. వీరిద్దరూ కలిసి చేస్తున్న తొలి చిత్రమిదే. శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎలిమెంట్స్ ఉంటూనే.. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కుతోందట.

ఈరోజు (జూన్ 12) గోపీచంద్ బర్త్ డే స్పెషల్ గా ‘విశ్వం‘ నుంచి కొత్త పోస్టర్ రిలీజయ్యింది. గోపీచంద్ స్టైలిష్ లుక్ లో ఓ బైక్ పై వస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా కావ్య థాపర్ నటిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్స్ పై టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts