‘భారతీయుడు 2‘లో మెరవనున్న మనీషా కోయిరాలా?

స్వాతంత్ర్యోద్యమంలో వీరోచితంగా పోరాడిన ఓ భారతీయుడు.. స్వాతంత్ర్యానంతరం జరుగుతోన్న అవినీతిపై ఎలా ఉక్కు పాదం మోపాడన్న కథతో ‘ఇండియన్’ చిత్రం వచ్చింది. 1996లో విడుదలైన ‘ఇండియన్‘ ఒరిజినల్ తమిళంతో పాటు.. తెలుగులో ‘భారతీయుడు‘గా అనువాద రూపంలో రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించింది.

ఈ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేశాడు. సీనియర్ కమల్ కి జోడీగా సుకన్య నటిస్తే.. జూనియర్ కమల్ కి జంటగా మనీషా కోయిరాలా నటించింది. ప్రస్తుతం ‘భారతీయుడు‘ సీక్వెల్ గా ‘భారతీయుడు 2‘ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ సేనాపతి గా కనిపించబోతుండగా.. అతనికి జోడీగా కాజల్ నటిస్తుంది. సీక్వెల్ లో సిధ్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ యువ జంటగా కనువిందు చేయబోతున్నారు.

‘భారతీయుడు 2‘ కథ ప్రకారం మొదటి భాగంలో నటించిన మనీషా కోయిరాలా కూడా సీక్వెల్ లో కనిపించనుందట. కమల్, మనీషా కోయిరాల తనయుడిగానే సిద్ధార్థ్ కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతుంది. అంటే.. సేనాపతిగా కనిపించే సీనియర్ కమల్ కి మనవడిగా సిద్ధార్థ్ కనిపించనున్నాడన్నమాట. మొత్తంమీద.. చాలా గ్యాప్ తర్వాత మనీషా కోయిరాలా మళ్లీ సౌత్ లో కనిపించే సినిమా ‘భారతీయుడు 2‘ కాబోతుంది. జూలై 12న వరల్డ్ వైడ్ గా ‘భారతీయుడు 2‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts