‘కల్కి‘ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్?

‘కల్కి‘ సినిమాలో ఇప్పటివరకూ బయటకు వచ్చింది గోరంత మాత్రమే.. ఇంకా చూడాల్సింది కొండంత ఉందంటూ చిత్రబృందం చెబుతోంది. ఇక.. కాస్టింగ్ పరంగానూ ఈ సినిమాలో ఎంతోమంది తారలు సందడి చేయబోతున్నారట. ఇప్పటికే ప్రభాస్ ‘కల్కి‘లో బాలీవుడ్ నుంచి లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో పాటు.. విశ్వనటుడు కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పఠాని వంటి భారీ తారాగణం ఉంది. వీరితో పాటు మరో ఇద్దరు స్టార్స్ కూడా ‘కల్కి‘లో కేమియోస్ తో మురిపించబోతున్నారట. వాళ్లే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్.

వైజయంతీ సంస్థలో నాగ్ అశ్విన్ తీసిన గత చిత్రం ‘మహానటి‘లో విజయ్, దుల్కర్ ఇద్దరూ నటించారు. ‘మహానటి‘ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే ‘కల్కి‘లోనూ వారిద్దరినీ కేమియోస్ లో చూపించబోతున్నాడట నాగ్ అశ్విన్. ‘మహానటి‘ మాత్రమే కాదు.. అంతకు ముందు నానితో నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘లో విజయ్ సెకండ్ హీరోగా అదరగొట్టాడు. అలాగే.. వైజయంతీలోనే వచ్చిన ‘సీతారామం‘.. దుల్కర్ కి సూపర్ డూపర్ హిట్ అందించింది. త్వరలోనే ‘కల్కి‘లో విజయ్, దుల్కర్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts