అన్ స్టాపబుల్ హీరో అడ్డగోలు వాదన

అన్ స్టాపబుల్. అని ఈ మధ్య ఓ సినిమా వచ్చింది గుర్తుంది కదా..? బిగ్‌ బాస్ విజేత విజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో ఏ పాత్రకూ సరైన ఔచిత్యం లేని అనేక పాత్రలు కనిపిస్తాయి. పేరుకు చాలామంది కమెడియన్స్ ఉన్నారు అని చెప్పుకున్నారు కానీ ఏ ఒక్క పాత్రా నవ్వించలేపోయింది. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీని యూనానిమస్ గా డిజాస్టర్ అని తేల్చారు ఆడియన్స్.

విమర్శకులు కూడా ఓ రేంజ్ లో కౌంటర్స్ వేశారు. అయితే దీనికి సదరు సినిమా హీరో విజే సన్నీ రియాక్ట్ అయ్యాడు. అది కూడా అడ్డగోలు వాదనతో. అసలే మాత్రం పసలేని వాదన ఇది.ఇంతకీ అతనేమన్నాడు అంటే.. ” సినిమా అంటే మాకు ప్రాణం. లేచిన దగ్గర్నుంచీ మేం సినిమాకోసమే బ్రతుకుతాం. అలాంటిది మీరు ఒక స్క్రిప్ట్ రాసి, నిర్మాతలను ఒప్పించి, సినిమా తీసి, రిలీజ్ చేసి అప్పుడు వేరే సినిమా గురించి రివ్యూ రాయాలట. ఆ దమ్మున్నోళ్లు మాత్రమే రివ్యూస్ చెప్పాలి అట. ఇదేమైనా పస ఉన్న వాదనేనా. తమ సినిమాలో మైనస్ లేంటీ.. ఈ సినిమా కోసం మేం కష్టపడ్డాం.. లేదా కొంతమందికి నచ్చుతుందీ అని చెప్పుకోవడం వేరు. కేవలం రివ్యూవర్స్ మీద పడి ఏడవడం వేరు.


ఇక సన్నీ వాదన ఎలా ఉందంటే.. ఏదైనా కూర బాలేదుఅని ఎవరైనా అంటే ముందు విత్తనాలు కొని, పొలంలో చల్లి, ఎరువులు వేసి.. పంటను కోసి, మార్కెట్ కు తెచ్చి అమ్మి అప్పుడు మీరు కూర గురించి కామెంట్ చేయండి అన్నట్టుగా ఉంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. బాలేని సినిమాను ఎవరైనా బాలేదు అనే అంటారు. పోనీ ఎవరైనా బావుందిఅన్నారు అంటే ఆ వీడియోస్ పెట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఏ వర్గం ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకున్న దాఖలాలు లేవు.

అలాంటప్పుడు మరో సినిమా కోసం జాగ్రత్త పడాలే కానీ.. ఇలా రివ్యూవర్స్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడ్డం ఏం సబబుగా ఉంటుంది. పోనీ అతనేమైనా అద్భుతమైన కళాఖండం చేశాడా అంటే లేదు కదా.. ఎప్పుడు ఇరవై ముఫ్ఫైయేళ్ల క్రితం వచ్చిన లాంటి కంటెంట్ ను ఏ మాత్రం ఆకట్టుకోని స�