ఈ నగరానికి తిరుగులేని డిమాండ్

కొన్ని సినిమాలు ఊరగాయ పచ్చడి లాంటివి. కాస్త మగ్గితే కానీ టేస్ట్ రాదు. అలాంటి సినిమానే ఈ నగారినికి ఏమైంది. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి రిలీజ్ టైమ్ లో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. యూత్ కు విపరీతంగా నచ్చినా ఇతర ఆడియన్స్ మాత్రం ఇదేం సినిమా అనుకున్నారు. అందుకే ఆశించినంత పెద్ద విజయం సాధించిలేదీ చిత్రం. బట్ కొన్నాళ్ల తర్వాత వచ్చిన రీల్స్ లోనూ, షార్ట్స్ లోనూ, యూట్యూబ్ కట్స్ లోనూ చూస్తున్నప్పుడు మాత్రం తెగ ఎంజాయ్ చేశారు ఆడియన్స్. అంటే ఓ మంచి సినిమాను మిస్ చేసుకున్నాం అని ఫీలయ్యారు. వారి ఫీలింగ్ ను ఫుల్ ఫిల్ చేసేందుకు ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నాడు తరుణ్ భాస్కర్.


ఈ నగరానికి ఏమైంది సినిమా విడుదలై ఐదేళ్లవుతోంది. ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. కొన్ని లిమెటెడ్ థియేటర్స్ లో మళ్లీ విడుదల చేయాలనుకున్నారు సురేష్‌ ప్రొడక్షన్స్ వాళ్లు. అయితే రీ రిలీజ్ అన్న టాక్ రాగానే విపరీతమైన డిమాండ్ వచ్చిందీ చిత్రానికి. హైదరాబాద్లోనే కాక జిల్లాలతో పాటు కొన్ని అర్బన్ సెంటర్స్ లో కూడా ఈ సినిమా కావాలని అడుగుతున్నారట. దీంతో థియేటర్స్ సంఖ్యను పెంచుతున్నారు. ఈ డిమాండ్ చూసి దర్శకుడుతో పాటు నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. ఇంత డిమాండ్ అప్పుడే వచ్చి ఉంటే ఇప్పటికే చాలా బాగుపడిపోయేవాడిని అంటూ సరదాగా ట్వీట్ చేశాడు తరుణ్‌ భాస్కర్.


ఈ చిత్రాన్ని మొదట 30న విడుదల చేయాలనుకున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్‌ తొలిప్రేమ కూడా ఉంది కాబట్టి.. ముందే వస్తున్నారు. అయినా వీరికి కూడా తొలిప్రేమ రేంజ్ లో డిమాండ్ ఉండటం విశేషమే. మరీ రికార్డులు బద్ధలు కొట్టేంత కలెక్షన్స్ కాకున్నా.. ఈ సారి మంచి కౌంటే వచ్చేలా ఉంది.
విశ్వక్ సేన్ కు మంచి బ్రేక్ ఇచ్చిందీ మూవీ. అలాగే ప్రస్తుత కమెడియన్ గా దూసుకుపోతోన్న అభినవ్ గోమటం కు కూడా. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు.. గోవా ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి.