టాలీవుడ్ క్రేజీ మూవీస్ ఓటీటీ పార్టనర్స్ లిస్ట్

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ కి సంబంధించి ఇప్పటికే ఓటీటీ పార్టనర్స్ లాక్ అయ్యాయి. ముఖ్యంగా.. తెలుగు నుంచి రాబోయే బడా మూవీస్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ జయంట్స్ దక్కించుకోవడం విశేషం. ముందుగా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనున్న టాలీవుడ్ బిగ్గీస్ విషయానికొద్దాం.

అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన ఐకానిక్ మూవీ ‘పుష్ప.. ది రైజ్‘. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప 1‘ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఇప్పుడు ‘పుష్ప 2‘ని అమెజాన్ కి కాకుండా నెట్ ఫ్లిక్స్ కి అమ్మారట మేకర్స్. నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘పుష్ప 2‘ స్ట్రీమింగ్ కానుందట.

నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానున్న మరో టాలీవుడ్ బిగ్ మూవీ ‘దేవర‘. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లోని యాక్టింగ్ పవర్ ను మరింతగా ఆవిష్కరించే చిత్రంగా ‘దేవర‘ నిలవబోతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ లో ‘దేవర‘గా టైటిల్ రోల్ లో అదరగొట్టాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ కి ఫ్యాన్సీ రేటుకి అమ్మారట మేకర్స్.

నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ రెడీ అవుతోన్న టాలీవుడ్ టాప్ మూవీస్ లో పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. రెబెల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి‘ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. అయితే.. ‘కల్కి‘ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కొన్ని భాషల్లోనూ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరికొన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండబోతుందట.

అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా టాలీవుడ్ నుంచి రాబోయే క్రేజీ మూవీస్ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‘. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితియార్థంలో ‘గేమ్ ఛేంజర్‘ రాబోతుంది.

అలాంద.. మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‘ ఓటీటీ డీల్స్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోతోనే జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

Related Posts