‘కల్కి 2’లో మరో ఇద్దరు అతిథులు

‘కల్కి’ చిత్రంలో అతిథి నటుల పరంపర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్య తారాగణం ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, శోభన వంటి వారితో పాటు.. అతిథులుగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్.జి.వి. వంటి వారు సందడి చేశారు.

సీక్వెల్ లో మరో ఇద్దరు అతిథి నటులు మెరవనున్నారట. వాళ్లే నాని, నవీన్ పోలిశెట్టి. అసలు నేచురల్ స్టార్ నానితోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినీ ప్రస్థానం మొదలయ్యింది. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నాగీని ఓ విలక్షణ దర్శకుడిగా నిలబెట్టింది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ కి నటుడిగా మంచి పేరొచ్చింది.

నాగ్ అశ్విన్ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి నటించిన ‘జాతిరత్నలు’ ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ‘కల్కి 2’లో నాని, నవీన్ పోలిశెట్టి పాత్రలు ఉంటాయని లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పటికే ‘కల్కి 2’ 60 శాతం వరకూ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే.. ఈ సినిమాని తిరిగి పట్టాలెక్కించనున్నాడట నాగీ.

Related Posts