ఓటీటీ లోకి వచ్చేసిన ఆ రెండు సినిమాలు

‘బేబి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన మూవీ ‘గం గం గణేశా’. ఈ మూవీలో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మే 31న థియేటర్లలోకి వచ్చిన ‘గం గం గణేశా’కి మంచి రివ్యూస్ వచ్చాయి. అయితే.. థియేట్రికల్ గా ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. లేటెస్ట్ గా ‘గం గం గణేశా’ ఓటీటీ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఈరోజు ఓటీటీలోకి వచ్చిన మరో చిత్రం ‘బాక్’. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’లో వచ్చిన నాల్గవ భాగమిది. ఈ సినిమాని తెలుగులో ‘బాక్’ పేరుతో విడుదల చేశారు. సుందర్ .సి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. మే 3న థియేటర్లలోకి వచ్చిన ‘బాక్’కి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం అదరగొట్టింది.

తమిళంలో ఈ సినిమా ఇంకా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా.. ‘బాక్’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.

Related Posts